వర్ష కొండ కు చేరిన స్వేరో సైకిల్ యాత్ర రాజ్యధికారి సంకల్ప యాత్ర

Published: Monday November 01, 2021

ఇబ్రహీంపట్నం, అక్టోబర్ 31 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో అందరికీ ఉచిత విద్య ఉచిత వైద్యం కావాలని స్వేరో స్టూడెంట్ యూనియన్ చేపట్టిన సైకిల్ యాత్ర వర్ష కొండకు చేరుకుంది తెలంగాణ అమరవీరుల స్థూపం గన్పార్కు నుండి బయలుదేరిన తొమ్మిది జిల్లాలు తిరిగి 23 రోజులకు 1100 కిలోమీటర్ల వచ్చి వర్ష కొండ నుండి ఆర్మూర్ నిర్మల్ ఇంద్రవెల్లి మంచిర్యాల్ వరంగల్ తెలంగాణ ముగించుకొని దక్షిణ తెలంగాణ మీరుగా తెలంగాణ రాష్ట్రం మొత్తం మహాత్మ పూలే విశ్వ రత్న బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మా నవార్ కాన్షీరామ్  గారు కలలుగన్న రాజ్యాన్ని స్థాపించడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలకు వివరిస్తూ సైకిల్ యాత్ర చేపట్టారు ఈ కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్ మరియు ఉమేష్ భాను రాజు హరికృష్ణ స్వేరో మెట్పల్లి డివిజన్ నాయకులు గుజ్జరి ప్రకాష్ బి ఎస్ పి కోరుట్ల నియోజకవర్గం అధ్యక్షుడు బోయిన వెంకటేష్ గుండా జగదీష్ తాండూర్ గణేష్ తోటకూర ప్రశాంత్ తిరుమలేష్ బొబ్బిలి కిషోర్ పాల్గొన్నారు.