ఘనంగా దెందుకూరు గ్రామ సభ-సర్పంచ్ విజయశాంతిప్రత్యేక అధికారి ప్రభాకర్ రావు

Published: Friday July 02, 2021
మధిర, జులై 01, ప్రజాపాలన ప్రతినిధి : దెందుకూరు హైస్కూల్ నందు సర్పంచ్ కోట విజయశాంతి అధ్యక్షత నా ప్రత్యేక అధికారి y ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో జిపి లెవల్లో పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామ సభ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో చేపట్టవలసిన పనులు గురించి తీర్మానం తీసుకోని ఆ పనులును వెంటనే చేపట్టేవిధంగా ఏర్పాటు చేసినారు. అనంతరం గ్రామంలో విశ్రాంతి ఉపాధ్యాయులు శ్రీ చుంచు సత్యనారాయణ రావు గారు జన్మ భూమి ఋణం తిర్చు కోవటం కోసం చిన్న స్కూల్ cps అభివృద్ధికి ప్రహరీ గోడ మెయిన్ గేట్ నిర్మాణంకోసం రెండు లక్షల యాభై వేలు చెక్కును సర్పంచ్ కి స్పెషల్ ఆఫీసర్ చేతుల మీదుగా గ్రామ పెద్దల సమక్ష్యంలో అందచేశారు. అదె విధంగా గ్రామంలో హైస్కూల్ కాంపౌండ్ వాల్ నిమిత్తం, డెవలప్ నిమిత్తం జడ్పీ నిధులు నుండీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు ఐదు లక్షల రూపాయలతో పాటు మరి కొన్ని గ్రామ అభివృద్ధికి నిధులు  మంజూరు చేస్తారు అని హామీ ఇచ్చారు అని సర్పంచ్ విజయశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చిత్త శుద్ధి తో పని చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ కోట వెంకట కృష్ణ, గ్రామ పెద్దలు కర్లపూడి అప్పారావు గారు, కపిలవయి కృష్ణ మూర్తి గారు, సంగయ్య గారు, రామారావు గారు, జీపీ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది, విద్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. దీన్లో hs కొండయ్య hs కాంతలీల జిపి సెక్రటరీ స్రవంతి anm రాజేశ్వరి అంగన్వాడీ ikp ఆశలు అన్ని శాఖ లు సిబ్బంది పాల్గొన్నారు.రామనాధం మరియు చుంచు సత్యనారాయణ లకు పౌరసన్మానం ఈ రోజు దెందుకూరు జిపి నందు గ్రామ సర్పంచ్ కోట విజయశాంతి, వెంకట కృష్ణ దంపతులు మరియు దెందుకూరు గ్రామపెద్దల సమక్షంలో హైస్కూల్ కళా వేదిక మీద డాక్టర్స్ డే సందర్బంగా ఘనంగా సన్మానం చేసినారు. గత సుదీర్ఘ కాలంగా ప్రజా వైద్యశాల నడుపుతూ ఎందరికో ఆరోగ్య సేవలు అందిస్తూ సదా పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తూ ఖమ్మం జిల్లాకు మధిర  ప్రాంతానికి మంచి ఖ్యాతి తెచ్చిన ఉత్తమ రాజకీయ వేత్తగా గుర్తింపు పొందిన మంచి మనిషి అని దెందుకూరు గ్రామ పెద్దలు కొనియాడారు. ఈ సందర్బంగా Dr రామనాధం మాట్లాడుతూ ప్రతిమనిషి సమాజ పోకడ లను బట్టి పరిణతి చెంది మానవ విలువలను కాపాడు కోవాలని తన వైద్య వృత్తిలో ఎదుర్కొన్న అనేక విషయాలు ప్రజలకు వివరించారు. అదే విధంగా విశ్రాంత ఉపాధ్యాయ లు చుంచు సత్య నారాయణ రావు గార్కి, meo శ్రీ Y. ప్రభాకర్ గారికి గ్రామ పెద్దల చేపౌర సన్మానం జరిగింది. గ్రామ అభివృద్ధికి సహకరించటం జన్మ భూమి ఋణం తీర్చు కున్నట్లే అని గ్రామ పెద్ద లు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దంపతులు ఎడ్లపల్లి సంగయ్య కర్లపూడి అప్పారావు, కపిలవాయి కృష్ణ మూర్తి, ఐతం ప్రసాదు, ఐతం సుబ్బారావు, ఐతం రామారావు, నన్నే బోయిన గంగరాజు, జిపి సెక్రటరీ స్రవంతి hs లంకా కొండయ్య meo y ప్రభాకర్ anm రాజేశ్వరి ikp అంగన్వాడీ తదితరులు పాల్గొన్నారు.