విద్యార్థులకు నూతన పరీక్ష విధానంపై -అవగాహన కార్యక్రమం.

Published: Saturday January 21, 2023

కోరుట్ల, జనవరి 20 (ప్రజాపాలన ప్రతినిధి):
జిల్లా పరిషత్ హై స్కూల్ పైడిమడుగు లో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పరీక్ష విధానంపై తొమ్మిదవ తరగతి ,పదో తరగతి, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి వెంకట్రాజం  నిర్వహించారు. ఈ పరీక్షలపై సబ్జెక్టు వారిగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సబ్జెక్టు బ్లూ ప్రింట్ పై చర్చ, అన్ని విషయాలపై పూర్తి అవగాహనను పాఠశాల ఉపాధ్యాయులు  విషయాలవారీగా విద్యార్థులకు వివరించారు. నూతన పరీక్ష విధానం కు సంబంధించి అన్ని విషయాల వారీగా ,మాడల్ పేపర్లు విద్యార్థులందరికీ అందించారు.
నూతనంగా ప్రవేశపెట్టిన పరీక్ష మోడల్ పై పూర్తిగా అవగాహన చేసుకుని పాఠశాల పేరును జిల్లా స్థాయిలో గుర్తింపు తీసుకురావాలని విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు కోరారు.
రాబోయే పదవ తరగతి పరీక్షలందు విద్యార్థులందరూ పాస్ అయ్యేవిధంగా ప్రణాళికలను రూపొందించడం జరిగిందనీ అదేవిధంగా ,పాఠశాల విద్యార్థులందరికీ, విషయాలవారీగా  యాక్షన్ ప్లాన్ తయారుచేసి ,విద్యార్థులు 10 జిపిఎస్ సాధించే దిశగా ఉపాధ్యాయులు ,విద్యార్థులందరూ కృషి చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంబటి వెంకటరాజం దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు ,విద్యార్థులందరూ పాల్గొన్నారు .