న్యూస్ 5 ఫోటోలు పెట్టండి సార్

Published: Wednesday August 03, 2022

ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 2 ప్రజాపాలన ప్రతినిధి.

*కబ్జాకు గురైన నాలా కల్వర్టు.. రహదారిపైకి చేరుతున్న వర్షపు నీరు
నీరు వెళ్లే దారిలేక నీట మునిగిన సాగర్ రహదారి
ఇబ్బందుల్లో ప్రజలు, ప్రయాణీకులు
పట్టించుకోని అధికారులు.. నోటీసులు సరి*


ఇబ్రహీంపట్నం బాగాయత్ 225 సర్వే నంబర్ లోని నాలా కల్వర్టు ను కొంత మంది కబ్జా చేశారు. దీంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు పోయే అవకాశం లేక వర్షపు నీరు సాగర్ రహదారిని ముంచేస్తుంది. మండల పరిధిలోని శేరిగుడా -చింతపల్లి గ్రామాల మధ్య వర్షపు నీరు వెళ్లేందుకు ఉన్న కలువ పూర్తిగా కబ్జా కొరల్లోకి వెళ్ళింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మంగళ్ పల్లి గ్రామ రెవెన్యూ నుండి శేరిగుడా - చింతపల్లి గ్రామాల మీదుగా పురందరి వాగు, తట్టిఖానా వాగులకు చేరాల్సిన వర్షపు నీరు సాగర్ రహదారిపై నిలుస్తోంది. ఫలితంగా సాగర్ రహదారి పూర్తిగా జలమయమవుతోంది. ఈ రహదారి గుండా వేలాది సంఖ్యలో ప్రయాణించే ప్రయాణికులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. నాలా భూములు కబ్జా తో మంగల్ పల్లి గ్రామ సమీపంలోని వెంకటేశ్వర రైస్ మిల్ ప్రహారీ గోడ కూలి అటునుండి నీరు వెళ్లే నాలా కు అడ్డుగా కొంత మంది పెద్ద పెద్ద రాళ్ళను, మట్టిని అడ్డుగా పోయడంతో వర్షపు నీరు సాగర్ రహదారిపై నుండి పారుతోంది. సాగర్ రహదారి ప్రక్కగా పెద్ద ఎత్తున నీటి కుంట ఏర్పడి చిన్నపాటి చెరువును తలపిస్తోంది. గత ఎన్నో ఏళ్లుగా వర్షపు నీరు యదావిధిగా నాలా నుండి పారేది. అయితే అక్కడి భూముల యాజమానులు కృష్ణారెడ్డి, బలవంత రెడ్డి లు నాలా ను కబ్జా చేసి నీరు దారి మళ్ళించే ప్రయత్నం చేశారని దీంతో నీరు వెళ్లే అవకాశం లేక రహదారి పై నుండి పారుతోంది రైతు జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ప్రయాణీకుల సమాచారంతో ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్ యూసుఫ్, ఇరిగేషన్ ఏఈ సాయికుమార్, అర్ఎండ్ బి అధికారులు సాగర్ రహదారిని పరిశీలించారు. నీటిని సాగర్ రహదారి కింద కాకుండా నాలా కల్వర్తు కింద నుంచి అదేవిధంగా తాత్కాలిక చర్యలు చేపట్టారు.


*పట్టించుకోని అధికారులు.. నోటీసులు సరి*

కొంత మంది ఏకంగా ఇబ్రహీంపట్నం బాగాయత్ 225 సర్వే నంబర్ లోని నాలా కల్వర్టు ను కబ్జా చేశారు. ఈ విషయం సంబంధిత రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలోనే కబ్జా ను గుర్తించిన అధికారులు కబ్జా దారులతో కుమ్మక్కై కేవలం నోటీసులు సరిపెట్టరాన్న ఆరోపణలు పక్క భూముల రైతుల నుండి వినిపిస్తున్నాయి. అధికారుల అలసత్వానికి రాజకీయ ఒత్తిళ్లు మరో కారణం అవుతున్నాయని దీంతో
అధికారులు నాలాకబ్జాను పట్టించుకోవడం లేదు.
అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.

*శేరిగూడ కౌన్సిలర్ ఈర్లపల్లి సునీతా వెంకట్ రెడ్డి*

నాలా కల్వర్టు ను కబ్జా చేసి వర్షపు నీటిని దారిమల్లిస్తున్నారని, దీంతో సాగర్ రహదారిపై నీరు చేరి ప్రయాణీకులు ఇబ్బంది పడుతున్నారని గతంలోనే సంబంధిత శాఖల అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని శేరిగూడ వార్డు కౌన్సిలర్ ఈర్లపల్లి సునీతా వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్, అర్ఎండ్ బి అధికారులకు ఎన్నో సార్లు ఈ సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయినా వారు పట్టించుకోలేదని దీంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి నాలా కల్వర్టును కబ్జా చేసిన వారితో చర్చించి నాలాను పునరుద్ధరించాలని నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.