శివారెడ్డిపేట్ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దుతా

Published: Wednesday February 17, 2021
శివారెడ్డిపేట్ పిఏసిఎస్ చైర్మన్ మాసనగారి ముత్యంరెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 16 ( ప్రజాపాలన ) : రైతు కష్టాలను, కడగండ్లను అతి దగ్గరగా పరిశీలించిన వ్యక్తే రైతు సమస్యలను పరిష్కరించగలడు. రైతులకు ఎలాంటి ఇబ్బుందులు కలగకుండా చూడగలగాలి. రైతులకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే వెంటనే సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తారనే భరోసా కల్పించాలి. అలాంటి కోవకు చెందిన వ్యక్తే శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడు మాసనగారి ముత్యంరెడ్డి. పిఏసిఎస్ అధ్యక్షునిగా ఏడాది కాలం పూర్తి అయిన సందర్భంగా "  ప్రజాపాలన జిల్లా ప్రతినిధి " తో మాట్లాడుతూ.. రాజకీయ నేపథ్యంలేని కుటుంబం నుండి 1995లో టిడిపి లో చురుకైన కార్యకర్తగా పనిచేశారు. పనితనాన్ని గుర్తించి ఎన్నేపల్లి టిడిపి గ్రామ అధ్యక్షునిగా పదవీ బాధ్యతలు అప్పగించారు. బాధ్యత చేపట్టిన తరువాత కార్యకర్తలను చైతన్యం చేసి టిడిపికి ఎదురులేని శక్తిగా మార్చాడు. టిడిపిని దెబ్బతీయడానికి చురుకుగా పనిచేసే వ్యక్తుల వేట కొనసాగించారు ఆనాటి కాంగ్రెస్ నాయకులు. మాసనగారి ముత్యంరెడ్డిని గుర్తించి 2013లో కాంగ్రెస్ పార్టీలో సభ్యునిగా చేర్చగలిగారు. సహకార ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై డైరెక్టరుగా విజయ దుందుభి మోగించారు. విజయం దక్కడంతోనే శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఉపాధ్యక్ష పదవి వరించింది. పార్టీ ఏదైనా కష్టపడి శక్తి వంచన లేకుండా కృషి చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయనేందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు.
టిఆర్ఎస్ ప్రభంజనం :
కాంగ్రెస్ కంచుకోటగా నిలిచిన వికారాబాద్ ప్రాంతంలో రానురాను కాంగ్రెస్ బలహీన దశకు చేరింది.  2019 లో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అండదండలు, ప్రోత్సాహంతో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ పాపగారి విజయ్ కుమార్ సూచనలు, సలహాతో టిఆర్ఎస్ పార్టీలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పట్టు వదలని విక్రమార్కుడిలా అను నిత్యం శ్రమించే వ్యక్తిత్వం కారణంగా మంచి నాయకుడిగా ఎదిగాడని పలువురు టిఆర్ఎస్ నాయకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
పదవులు :
కొందరికి రాజకీయ పదవులు కోరితే వస్తాయి. కానీ, మాసనగారి ముత్యంరెడ్డికి మాత్రం అతని దగ్గరికే వచ్చి చేరడం విశేషమని సన్నిహితుల మాట.
శివారెడ్డిపేట్ పిఏసిఎస్ అధ్యక్ష పదవి :
పార్టీలో చురుకుగా చలాకీగా కార్యకర్తలను తన అడుగుజాడల్లో నడిపించడంలో అందెవేసిన చెయ్యి. ఎంతటి జఠిల సమస్యనైనా తన చాతుర్యంతో ఇట్టే పరిష్కరించగల నేర్పరి. రైతుల సమస్యలు బాగా తెలిసిన వ్యక్తి కావడం వలన సహకార సంఘం ఎన్నికల్లో డైరెక్టరుగా సులభంగా గెలిచాడు. డైరెక్టరుగా గెలవడమే కాకుండా 16 పిభ్రవరి 2019లో  శివారెడ్డిపేట్ పిఏసిఎస్ అధ్యక్ష పదవి కూడా లభించడం అతని పనితనానికి నిదర్శనం.
రైతులకు కొండంత భరోసా :
అధ్యక్ష పదవి చేపట్టగానే రైతులకు దీర్ఘకాలిక రుణాల కింద 35 మంది రైతులకు కోటిన్నర రుణాలు, ఖకరీఫ్ లో స్వల్పకాలిక రుషాలు 775 మంది రైతులకు 3 కోట్ల 80 లక్షల రుణాలను ఇచ్చి రైతులందరి హృదయాలలో చెరగని ముద్రవేసుకున్నాడు. ఫిబ్రవరి, మార్చిలో దీర్ఘకాల రుణాలు దాదాపు 100 కు పై చిలుకు సభ్యులకు 2 కోట్లకు పైగా రుణాలు అందజేయడం విశేషం.
నాబార్డు సహకారం :
నాబార్డు, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సహకారంతో రైతులకు గిడ్డంగులు మంజూరు చేయించడం జరిగింది. శివారెడ్డిపేట్ పిఏసిఎస్ స్వంత స్థలంలో, పులుసుమామిడి గేట్ సమీపంలో 2 ఎకరాల స్థలంలో త్వరలో ప్రారంభించనున్నారు.
ఆదర్శ సహకార సంఘం :
శివారెడ్డిపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి ఆదర్శ సహకారంగా తీర్చి దిద్దుతానని విశ్వాసం వ్యక్తం చేశారు.