డప్పు కళను ప్రోత్సహించడమే లక్ష్యం

Published: Friday February 17, 2023
* జిల్లా లగోరి అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ తుప్ప ఆనంద్
వికారాబాద్ బ్యూరో 26 ఫిబ్రవరి ప్రజాపాలన : డబ్బుకళను ప్రోత్సహించడమే లక్ష్యంగా డప్పు దరువు పోటీలను నిర్వహించా నిర్వహిస్తున్నామని జిల్లా లగోరి అసోసియేషన్ అధ్యక్షుడు ది లైట్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ తుప్ప ఆనంద్ అన్నారు. గురువారం మోమిన్ పెట్ మండల కేంద్రంలో డప్పుదరువు పోటీలను నృత్య రూపంలో నిర్వహించారు. డప్పు దరువు పోటీలలో 9 జట్లు పాల్గొన్నాయన్నారు. ఒక్కొక్క జట్టులో కనీసం పదిమంది మాక్సిమం 20 మంది చొప్పున ఉన్నారని వివరించారు. ఖమ్మం, వరంగల్, గుంటూరు, నారాయణఖేడ్, మహబూబ్ నగర్, రంగారెడ్డి,  వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ జిల్లాల నుండి డప్పు వాయిద్య కళాకారులు పాల్గొన్నారు. మొదటి రౌండ్ పోటీలకు నిర్దిష్ట సమయం 18 నిమిషాలు, రెండవ రౌండ్ పోటీలకు నిర్దిష్ట సమయం 15 నిమిషాలు మూడవ రౌండ్ పోటీలకు నిర్దిష్ట సమయం పది నిమిషాలు కేటాయించామని చెప్పారు. డప్పు వాయిద్య కళాకారుడు జడ్జ్ అందె భాస్కర్ మాట్లాడుతూ డప్పు దరువు పోటీలలో నాలుగు రకాల డప్పు వాయిద్యాలను నృత్య రూపంలో డప్పు వాయిద్యం చేశారని తెలిపారు. డప్పు వాయిద్యాలలో నాలుగు రకాలు ఉంటాయని వివరించారు. అవి పలక, పెద్ద డప్పు, చిన్న డప్పు, ఠకోరా. పలక డప్పు వాయిద్యంలో ధ్వని ఎక్కువగా వినిపిస్తుందని అన్నారు. ఈ వాయిద్యాన్ని ఊరేగింపులలో ఉపయోగిస్తారని వివరించారు. పెద్ద డప్పు వాయిద్యంలో వివిధ రకాల జాతరలు సంబరాలలో దీనిని వాడతారని స్పష్టం చేశారు. చిన్న డప్పు వాయిద్యంలో వాయిద్య పరిమాణం తక్కువగా ఉంటుందని అన్నారు. ఈ వాయిద్యం శ్రావ్యమైన శబ్దాన్ని ఇస్తుందన్నారు. ఠకోర వాయిద్యంలో వీధులలో చాటింపు కొరకు ఉపయోగించే వాయిద్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ లగోరి అసోసియేషన్ రాష్ట్ర సెక్రెటరీ పెద్దింటి నవీన్ కుమార్, రాష్ట్ర లగోరి ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్, డప్పు కళాకారుడు డప్పు దరువు న్యాయమూర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు.