డిఎంఎఫ్టి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టండి

Published: Thursday July 14, 2022
 విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
వికారాబాద్ బ్యూరో జూలై 13 ప్రజా పాలన :  డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులు ( డిఎంఎఫ్టి ) నుండి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులు చేపట్టుటకు రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రజా ప్రతినిధులు, అధికారులతో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ  సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, తాండూర్ నియోజకవర్గంలో డి ఎం ఎఫ్ టి నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుటకు గాను 10.37 కోట్ల రూపాయలు ఏమోదిస్తున్నట్లు  తెలియజేసినారు.  తాండూర్ పట్టణనములో ఇంద్రా చౌక్ నుండి రైల్వేస్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్ మరియు భూ సేకరణ బిల్లు చెల్లింపు కొరకు రూ. 2.85 కోట్లు, క్రీడా సామాగ్రి కొనుగోలు కొరకు రూ. 1.85 కోట్లు, తాండూర్ నియోజకవర్గంలో అంగన్వాడీ భావనములు, బస్సు షెల్టర్లు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, మురుగు కాలువలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లకు రూ. 5.67 కోట్లు ఏమోదిస్తున్నట్లు మంత్రి తెలియజేసినారు.  వికారాబాద్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురికి కాలువలు మరియు సీసీ రోడ్ల నిర్మాణము కొరకు రూ. 1.73 కోట్లు అమోదించగా, పరిగి నియోజకవర్గంనకు మహిళా శిశు సంక్షేమం, ఇతర సివిల్ పనులకు రూ. 3.05 కోట్లను సమావేశంలో మంత్రి ఆమోదించడం జరిగినది.  ఇప్పటి వరకు మంజూరై పెండింగ్లో ఉన్న పనులకు కూడా రూ. 3.47 కోట్లకు కూడా DMFT నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి తెలియజేసినారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ నిఖిల, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు Dr. రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, సురభి వాణిదేవి, వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్, శాసన సభ్యులు మెతుకు ఆనంద్, పైలట్ రోహిత్ రెడ్డి, మహేష్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిలతో పాటు డిఆర్డిఓ కృష్ణన్ వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area