వికలాంగులకు చేయూతనందించడం మనందరి బాధ్యత : మాజీ కార్పొరేటర్ శేషుకుమారి...

Published: Tuesday January 03, 2023
అమీర్ పేట్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
సమాజ సేవలో ఎప్పుడూ ముందుండే అమీర్ పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వికలాంగులకు ఆర్థిక సహాయం అందించారు.నూతన సంవత్సర సందర్భంగా వారి తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారి సంఘం యొక్క ఖర్చుల నిమిత్తం పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో పలువురు అమీర్ పేట్ డివిజన్ టి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.