ప్రింట్ వారియర్స్ కు సేవ కార్యక్రమంలో ప్రతి డివిజన్

Published: Monday May 31, 2021
బాలపూర్, మే 30, ప్రజాపాలన ప్రతినిధి : భారతదేశ ప్రధానమంత్రి అడుగుజాడల్లో నడవాలని బిజెపి నేతలు అందరినీ కోరారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ వివిధ డివిజన్లలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న బిజెపి కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధికారం చేపట్టి 7 సంవత్సరాలు పూర్తిఅయ్యిన సందర్భంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ఆదేశానుసారం భారతీయ జనతా పార్టీ బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు చెరుకు పల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో అదే విధంగా పలు డివిజన్లలో సేవ కార్యక్రమాలు నిర్వహించారు.. బడంగ్ పేట్ లో 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు సిబ్బందికి బియ్యం కూరగాయలు పండ్లు సానిటైజర్లు మాస్కులు పంపిణీ చేశారు.అలాగే  అల్మాస్ గూడలొ జెనిగె పద్మ ఐలయ్య, రామిడి సూరకర్ణ రెడ్డి, గుర్రం గూడలొ గడ్డం లక్షా రెడ్డి, దడిగె శంకర్, నాదర్ గుల్ లొ నిమ్మల శ్రీ కాంత్ గౌడ్, కుర్మల్ గూడలొ టేకుల భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఆదివారం నాడు పలు నేతలతో పంపిణీ నిర్వహించారు. పలు కార్యక్రమంలో పెద్దలు మాట్లాడుతూ. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరే విధంగా కృషి చేస్తూ కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ ఆంక్షలను పూర్తిగా శిరసావహిస్తూ కరోనా మహమ్మారి నుండి నిన్ను, నీ కుటుంబాన్ని బంధుమిత్రులను, సమాజాన్ని కాపాడుతూ ఆపత్కాలంలో సేవ చేస్తున్నా యోధులను గౌరవిస్తూ, సత్కరిస్తు, ఉపాధి కోల్పోయిన అభాగ్యులకు తోచిన విధంగా మీ శక్తి కొలది సేవా కార్యక్రమాలు చేసుకుంట నరేంద్ర మోడీ అడుగుజాడలో నడువాలని కోరారు. ఈ కార్యక్రమంలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ అధ్యక్షులు చెరుకు పల్లి వెంకట్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సామ సంజీవరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం మల్లారెడ్డి, జిల్లా ఏసీ మోర్చా కార్యదర్శి కుంటి భాస్కర్, బడంగ్పేట్ కార్పొరేషన్ కార్పొరేటర్లు బంగారు అనిత రాణి ప్రభాకర్, గౌర రమాదేవి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ నడికూడ యాదగిరి, పెద్దబావి సమర సింహా రెడ్డి, కార్పొరేషన్ ఉపాధ్యక్షుడు చిత్రం శ్రీనివాస్, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి దొడ్డి మల్లికార్జున్, కార్పొరేషన్ కార్యదర్శి జగదీశ్వర్ రాజు, మహిళ మోర్చా అధ్యక్షురాలు మమత ఆనంద్ రావు, యువ మోర్చా అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి, సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి, సామ సుధాకర్ రెడ్డి, జగన్మోహనచార్యులు నారాయణ రావు, మహేందర్, లోకం నివేదిత సాయిసంతోష్, సురేష్, ఈశ్వర్, నాగ నందీశ్వర్ రెడ్డి, వంశీకృష్ణ రెడ్డి, రాజ్ కుమార్ సోను యాదవ్, భరద్వాజ్, రోహిణిశ్రీకృష్ణ, బంగారు రాజ్ కుమార్, విజయ్ కాంత్, సిద్దేశ్వర్ రెడ్డి, అక్షయ్, రణధీర్, బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.