పెండింగ్లో ఉన్న కాలర్ షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి: ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస

Published: Wednesday November 17, 2021
మధిర నవంబర్ 16 ప్రజాపాలన ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వైరా డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ని పెండింగ్లో ఉన్న కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించడం జరిగినది, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జమ్మి అశోక్ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలు నుండి విద్యార్ధులకు ఇవ్వాల్సిన ఉపకార వేతనాలు, విద్యార్థులు చదువుకున్నందుకు యాజమాన్యాలకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తమ చదువులకు స్వస్తి పలుకుతున్నారు అన్నారు. ఫీజులు రాలేదు కాబ్బటి మీ సర్టిఫికేట్స్ ఇవ్వం కడితే ఫీజులు కట్టండి లేదంటే రీయంబర్స్ వచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్స్ తీసుకోండని కళాశాల యాజమాన్యం ఖరాఖండిగా చెబుతున్నారు. దీంతో పేద విద్యార్థులు తమ చదువులు మధ్యలో మానేసి ఇతర పనులకు వెళ్తున్నారు. అందుకోసమే ఈ రెండు సంవత్సరాలు పెండింగ్ ఉన్న 3 వేల కోట్ల ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలని అన్నారు, కాలర్ షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసి ఫ్రీజింగ్ లో పెట్టి మేము కాలర్ షిప్ ఇచ్చిన అని గొప్పగా చెప్పుకుంటున్నారు అన్నారు, ప్రభుత్వం కాలర్ షిప్ విడుదల చేస్తే ఎందుకోసం విద్యార్థుల అకౌంట్ లోకి రాలేదు వెంటనే ఫ్రీజింగ్లో పెట్టిన ఉపకార వేతనాలు విడుదల చేయాలని కోరారు, వైరా స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నిర్వీర్యం అవుతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దుర్మార్గమని అన్నారు, విద్యార్థుల జీవితాలను రాజకీయాలకు ప్రణంగా పెడతారా మూడేళ్ల గా నిలిచిపోయిన ఫీజు రీయింబర్స్ మెంట్ పై చిత్తశుద్ధి ఏదీ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రాధాన్యత ఉపకారవేతనా లు. చెల్లింపు ఇవ్వరా 3800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలి అన్నారు, ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భార్గవ్, లక్ష్మణ్, సురేష్, సుమతి, మహేశ్వరి, తదితరులు పాల్గొన్నారు, డిమాండ్స్
1. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి
2. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
3. ఖాళీగా ఉన్న లెక్చరర్ మరియు గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేయాలి
4. ప్రతి విద్యార్థికి నెలకు వెయ్యి రూపాయలు పాకెట్ మనీ ప్రభుత్వం ఇవ్వాలి
5. షెడ్లు ఫిట్నెస్ నేను బిల్డింగ్ లో ఉన్న జూనియర్ కళాశాల కు వెంటనే కొత్త భవనాలు నిర్మించాలి.
6. ప్రతి జూనియర్ కళాశాలలో బైపీసీ ప్రాక్టికల్స్ ల్యాబ్ మరియు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి
7. బాత్ రూమ్స్ మరుగుదొడ్ల సదుపాయం కల్పించాలి వాటర్ సదుపాయం ఏర్పాటు చేయాలి.
8. ప్రతి జూనియర్ కళాశాలలో మినరల్ వాటర్ సదుపాయం మరియు ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి,
9. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆడుకునే ఆట వస్తువులను ఇవ్వాలి,
10. పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి