రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలినామమాత్రపు ప్రకటనలతో నిరుద్యోగులకు ఉపయోగం ల

Published: Thursday June 09, 2022

మధిర జూన్ 8 ప్రజా పాలన ప్రతినిధి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు  అన్నింటికీ నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మద్దెల ప్రసాద రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగ సమస్యలపై ప్రతి మంగళవారం వైఎస్ షర్మిల చేపడుతున్న నిరుద్యోగ దీక్ష వైరా మండలం స్నానాల లక్ష్మీపురం గ్రామంలో నిర్వహించారు ఈ దీక్షకు మద్దెల ప్రసాదరావు సంఘీభావం తెలిపి ప్రసంగించారు.  రాష్ట్రంలో ఇప్పటికే టీఎస్ పోర్టల్ లో 29 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారికంగా ఏర్పాటుచేసిన పిఆర్సి కమిటీ చెప్పినట్లు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఒక లక్షా తొంభై ఒక్క వేల ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి భర్తీ చేయాలన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది యువత ఆత్మ బలిదానాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  కెసిఆర్ కుటుంబానికి తప్ప నిరుద్యోగులకు ఎవరికి ఉపయోగం జరగలేదన్నారు. ఇప్పటివరకు ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవటం వల్ల  నిరుద్యోగుల వయస్సు పెరిగిపోవడం వల్ల ఉద్యోగం రాధని నిర్ణయించుకుని వేరే దారి లేక అవమానం భరించలేక తమ జీవితాలను బలి చేసుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు అనేక దొంగ హామీలు ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం, నిరుద్యోగుల ఆత్మహత్యలు నివారించేందుకు తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నింటికీ నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తానని టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు నిరుద్యోగ భృతిపై కేసీఆర్ మాట్లాడటం లేదన్నారు. అసెంబ్లీలో నిరుద్యోగ నిరుద్యోగ భృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేస్తారని నిరుద్యోగులు ఎంతగానో ఎదురు చూశారని కానీ నిరుద్యోగ భృతిపై కేసీఆర్ ఎటువంటి ప్రకటన చేయకపోవడం నిరుద్యోగులను నిరుత్సాహానికి గురి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని గతంలో చెప్పి పాలాభిషేకాలు చేయించుకున్న కెసిఆర్ మాట తప్పారని ఆయన గుర్తు చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయంలో ఈసారైనా మాట నిలుపుకోవాలని ఆయన సూచించారు.