రేపటి నుండి కూరగాయలు, ఫ్రూట్స్ అన్ని మార్కెట్ యార్డ్ లోనే

Published: Friday May 28, 2021
మార్కెట్ యార్డ్ స్థలాన్ని పరిశీలించిన సిఐ మురళి,
తాసిల్దార్ సైదులు.
ప్రజలు కూరగాయలకు మార్కెట్ యార్డుకు వెళ్లాల్సిందే.
మధిర, ప్రజాపాలన ప్రతినిధి : 27వ తేదీ మధిర మున్సిపాలిటీ పరిధిలోకరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి విధితమే. ఈ సందర్భంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు రైతుబజార్లో జనం కూరగాయల కోసం ఎక్కువగా గుంపులు గుంపులుగా ఉండటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతు బజార్ ను మార్కెట్ లోకి మార్చినట్లు స్థానిక తాసిల్దార్ సైదులు సిఐ మురళి పేర్కొన్నారు. ప్రజలందరూ కూరగాయల కావాలన్న ఫ్రూట్స్ కావాలన్నా మార్కెట్ యార్డ్ వెళ్లి భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరించి కొనుగోలు చేసుకోవాలని సూచించారు. మార్కెట్ యార్డ్ లో తప్ప రోడ్ల వెంట కూరగాయల, ఫ్రూట్స్ అమ్మిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రైతు బజార్ లో రైతులకు మధిర మార్కెట్ యార్డులో లాటరీ పద్ధతిలో షాపులను అధికారులు ఏర్పాటు చేయించారు. ఈ కార్యక్రమంలో మధిర టౌన్ ఎస్ఐ సతీష్ కుమార్ ఆర్ఐ విజయ్ కృష్ణ, మార్కెట్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.