ఘనంగా కోరుట్ల జడ్పిటిసి దారిశెట్టి లావణ్య రాజేష్ జన్మదిన వేడుకలు

Published: Monday October 03, 2022

కోరుట్ల, అక్టోబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో  కోరుట్ల జెడ్పీటీసీ దారిశెట్టి లావణ్య రాజేష్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.వివిధ గ్రామల ప్రజాప్రతినిధులు,నాయకులు వేడుకల్లో పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు చిట్టి వెంకట్రావ్, వైస్ ఎంపీపీ చీటీ స్వరూప,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,ప్యాక్స్ చైర్మన్లు,ఉప సర్పంచ్ లు, రైతు సంఘ సభ్యులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.