ముగిసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి పర్యటన....

Published: Thursday December 29, 2022

బూర్గంపాడు (ప్రజాపాలన.)

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భద్రాద్రి పర్యటన భారీ
కాన్వాయ్ మధ్య బూర్గంపాడు మండలం సారపాక ఐటీసీ బిపిఎల్ స్కూల్ వద్ద స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ అజయ్ మరియు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. అక్కడనుండి భారీ కాన్వాయ్ తో  ప్రారంభమై భద్రాచలం బయలుదేరి వెళ్లి అక్కడ రామాలయంలో రాష్ట్రపతి ముర్ముకు ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికినారు. అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. తర్వాత స్వామివారి ప్రసాదా కౌంటర్ ని ప్రారంభించి తద్వారా ఏర్పాటు చేసినటువంటి సమ్మక్క ,సారక్క సమ్మేళనంలో పాల్గొని తిరిగి ఐటిసి గెస్ట్ హౌస్ ద్వారా హెలికాప్టర్లో ములుగు బయలుదేరి వెళ్లారు. వారి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మంత్రి పువ్వాడ అజయ్ మరియు మంత్రి  సత్యవతి రాథోడ్, జిల్లా ఎస్పీ తదితరులు వారి వెంట ఉన్నారు.