33వ వార్డులో ఉచిత వైద్య శిబిరం

Published: Tuesday February 09, 2021
వార్డు కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08 ( ప్రజాపాలన ) : వార్డు ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంతో వార్డులో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని 33వ వార్డు కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో " మా శారద ఆసుపత్రి " సౌజన్యంతో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ అంబప్రసాద్, డాక్టర్ అనూష చిలివరి, డాక్టర్ బాలకృష్ణల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ అర్థ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..వార్డులో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో అనుభవజ్ఞులైన వైద్యులు ఉచితంగా జబ్బులను పరీక్షించి మందులు రాస్తున్నారని పేర్కొన్నారు. నిరుపేదలు, పేదలు, దీర్ఘకాల వ్యాధులతో బాధపడేవారు, వార్డు ప్రజలందరూ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. వైద్య శిబిరంలో బిపి, షుగర్, డయాబెటీస్, ఆర్థో, గైనకాలజీ, ఈఎన్టి, నీరో, గ్యాస్స్ట్రో, ఆప్తికల్, కిడ్నీ సమస్యలు, చిన్న పిల్లల సమస్యలు, జనరల్ వ్యాధులు వంటి వాటిని పరీక్షించారని తెలిపారు. కొత్రేపల్లిలోని శ్రీ సాయి డెంటల్ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన " మా శారద ఆసుపత్రి "  24/7 పనిదినాలతో అతి తక్కువ ఫీజుతో, అన్ని మౌళిక వసతులు గల ఆసుపత్రిలో నాణ్యమైన వైద్య చికిత్సలు అందించబడును అన్నారు. 33వ వార్డులో ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 1.30 వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజా సంఘాల కార్యదర్శి పెండ్యాల అనంతయ్య, వికారాబాద్ ఎంపిపి కామిడి చంద్రకళ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ ముదిరాజ్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రవి శంకర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దోమ శ్రీధర్, కె.క్రిష్ణ, బస్వరాజ్, వహీద్ మియా, రాకేష్ యాదవ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజర్ మమత, మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ రావు, అడ్మిన్ మణిదీప్, ఫార్మాసిస్ట్ కిరణ్, నర్సులు రాణి, విజయ తదితరులు పాల్గొన్నారు.