ద్విచక్ర వాహనాల దొంగల ఆచూకీ లభ్యం

Published: Friday February 11, 2022
జిల్లా అదనపు ఎస్పీ ఎంఏ రషీద్
వికారాబాద్ బ్యూరో 10 ఫిబ్రవరి ప్రజాపాలన : వికారాబాద్ జిల్లా ఎస్‌పి ఎన్.కోటి రెడ్డి ఐపి‌ఎస్ ఆదేశానుసారం జిల్లా టాస్క్ఫోర్స్ వారు ద్విచక్రవాహనాల దొంగలను అదుపులో తీసుకోవడం జరిగిందని జిల్లా అదనపు ఎస్పీ ఎం ఏ రషీద్ అన్నారు. ఇట్టి ద్విచక్రవాహనాల దొంగల వివరాలు జిల్లా అదనపు ఎస్‌పి ఎంఏ రషీద్ ప్రెస్ మీట్ ద్వారా వివరించడం జరిగింది. జిల్లా టాస్క్ఫోర్స్ వారు నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు అనగా 10 ఫిబ్రవరి 3022న మోమిన్ పేట్ ఎక్స్ రోడ్ లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా వారు గతంలో చేసిన దొంగతనాలకు ఒప్పుకోవడం జరిగింది. కమ్మరి సునిల్, తండ్రి రమేష్, వయస్సు 26 సం:రాలు, వృత్తి: లేబర్, కులము BC-కమ్మరి, నివాసము: తరిగోపుల గ్రామము, దారుర్ మండలము, వికారాబాద్ జిల్లా. రెండవ వ్యక్తి 2. కమ్మరి ఆకాష్, తండ్రి లక్ష్మణ్, వయస్సు 22 సం:రాలు, వృత్తి: లేబర్, కులము: రాజీవ్ నగర్ కాలనీ, తాండూర్, వికారాబాద్. పై తెలిపిన వ్యక్తులు విలాసాలకు అలవాటు పడి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాల దొంగతనాలు చేయడం జరిగింది. ఈ క్రింద పోలీస్స్టేషన్లలో సుమారు పదకొండు మోటార్సైకిల్ దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకోవడం జరిగింది మరియు 11 మోటార్సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొమింపేట్ పోలీస్ స్టేషన్ -01 మోటార్ సైకిల్ AP-11-AN-8871 BDL బానుర్ పోలీస్ స్టేషన్-01 మోటార్ సైకిల్ AP-23-AC-4774 చేవెళ్ల పోలీస్ స్టేషన్ -03 మోటార్ సైకిల్ తాండూరు పోలీస్ స్టేషన్ -01 జహీరాబాద్ పోలీస్ స్టేషన్ -01 మోటార్ సైకిల్ కర్ణాటక రాష్ట్రం ముదోల్ 02 మోటార్ సైకిల్ కర్ణాటక రాష్ట్రంలోని మల్ఖేడ్ పోలీస్ స్టేషన్ -01 మోటార్ సైకిల్ Ap13AD9218 అనే బండి ఏ పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగిందో తెలుసుకోవాల్సి ఉంది. ఇట్టి పై వ్యక్తులు అన్నీ మోటార్ సైకిళ్ళను దొంగతనం చేసి ఇట్టి వ్యక్తులకు మిత్రుడు అయిన నాగారం గ్రామం దారుర్ మండలం వికారాబాద్ జిల్లాకు చెందిన ఆశమ్మోల్ల రవికుమార్ @ శివమణి @ శివ తండ్రి late వెంకటయ్య గౌడ్ కు అమ్ముకొని జల్సాలు చేస్తున్నారు. ఇట్టి పై వ్యక్తులపై పై పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయనైనది. గతములో A 1 కమ్మరి సునిల్ పై మూడు పోలీస్ స్టేషన్లలో అనగా 1) మియాపూర్ 2) ఎల్‌బి నగర్ 3) నందిగామ పి‌ఎస్ లలో నేర చరిత్ర కలదు. ఇట్టి కార్యక్రంలో మోమిన్ పేట్ సి‌ఐ వెంకటేశం, మోమిన్ పేట్ ఎస్‌ఐ విజయ్ ప్రకాష్, మరియు టాస్క్ ఫోర్స్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.