జిల్లా పూర్తి సమాచారం గణాంకదర్శినిలో నిక్షిప్తం

Published: Friday July 01, 2022
వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూన్ 30 ప్రజాపాలన : వికారాబాద్ జిల్లాకు సంబంధించిన పూర్తి సమాచారం "గణాంకదర్శిని" అను పుస్తకం దర్పణం వంటిదని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు. 16వ జాతీయ గణాంక దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో  జిల్లా ప్రణాళిక అధికారి కార్యాలయం ద్వారా ముద్రించిన జిల్లా గణాంకదర్శిని - 2020-21 బుక్లేట్ ను జిల్లా కలెక్టర్ నిఖిల ఆవిష్కరించినారు.  ఈ కార్యక్రమంలో సిపిఓ నిరంజన్ రావు, కార్యాలయ సిబ్బంది రఘురామ్ తదితరులు పాల్గొన్నారు