ఎంసెట్ క్రాష్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలి ** డీఐఈఓ శ్రీధర్ సుమన్ ** రోజు రెండు పూటలా జూమ్

Published: Tuesday April 04, 2023
అసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 3 (ప్రజాపాలన, ప్రతినిధి) : 
 
ఆసిఫాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వరంగ కళాశాలల విద్యార్థులు ఎంసెట్ క్రాష్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మాధ్యమిక విద్యాధికారి శ్రీధర్ ’సుమన్’ సోమవారం తెలిపారు. ఇంటర్ విద్య మరియు సమగ్ర శిక్ష ఆద్వర్యంలో "ఎంసెట్ వేసవి శిక్షణ" ప్రారంభమైందని ప్రతీ రోజు ఉదయం 6:30 గం నుండి 10:50 వరకు, సాయంత్రం 5:00 గం నుండి 7:45 వరకు వివిద సబ్జెక్టులపై నిపుణులైన అధ్యాపకుల తరతతులుంటాయని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఇప్పటికే సంబంధిత జూమ్ లింకుల పీడీఎఫ్ ఫైల్ ను పంపించారని, విద్యార్థులు ఆయా లింకుల ద్వారా ప్రతీరోజు జూమ్ తరగతులకు హాజరై ఉచిత ఎంసెట్ శిక్షణ పొందవచ్చని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిపుణులైన అధ్యాపకులచే రూపొందించబడిన తరగతులు ఎంసెట్ రాయబోతున్న విద్యార్థులకు ఉపయోగపడుతున్నాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉచిత క్రాష్ కోర్సును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.