రేకుల షేడ్స్ ఇండ్ల బాధితులను పరమర్శించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

Published: Thursday May 13, 2021
బీరుపూర్, మే 12 (ప్రజాపాలన ప్రతినిధి): బీరుపూర్ మండలంలో  సోమవారం రోజున ఆకాల వడగళ్ల వర్షం ఈదురు గాలులతో ఇండ్లు రేకుల షేడ్స్ పైకప్పులు లేచి పోవడంతో సమాచారం అందుకున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించారు. దాసరి లలిత అనే బాధిత కుటుంబానికి 3 వేల ఆర్థిక సహాయం చేసి బీరుపూర్ తహశీల్దార్ అరిఫోద్దీన్ తో మాట్లాడుతూ ప్రభుత్వపరంగ ఆదుకోవాలని జీవన్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ వెంట సారంగాపూర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ అధ్యక్షుడు గుడిసె జితేందర్ యాదవ్ చేరుపూరి శుభాష్ ఏనుగు జోగిరెడ్డి చిర్నేని శ్రీనివాస్ బదినపల్లి శంకర్ పుడూరి రవి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు.