మస్కూలు,శానిటైజర్ లు పంపిణీ చేసిన ఎంపీటీసీ

Published: Saturday May 22, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని అరూర్ గ్రామంలో శుక్రవారం ఎంపీటీసీ పసల జ్యోతి విజయానంద్ పెళ్లి రోజు సందర్భంగా అరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50మంది కరోనా పేషెంట్ లకు మస్కూలు, శానిటైజర్ లు ఒక్కొక్కరికి కేజీ చికెన్ అందజేశారు. అనంతరం గ్రామంలో పెళ్లి రోజు సందర్భంగా యూత్ కాంగ్రెస్ సబ్యులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి తన ధ్యేయంగా పని చేయడం జరుగుతుందని అందులో భాగంగానే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో తనవంతుగా మాస్కులు,శానిటైజర్ లను పంపిణీ చేయడం జరిగిందని జ్యోతి విజయానంద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అరూరు గ్రామం సర్పంచ్ చిట్టిడి జయమ్మ జనార్దన్ రెడ్డి మాజీ సర్పంచ్లు చేమ్మయ్య, దానయ్య, కేదారి శ్రీనివాస్, యూత్ సభ్యులు, డాక్టర్ జ్యోతి, ఏఎన్ఎం శోభారాణి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.