అప్పపెళ్లి గ్రామ సమస్యలు పరిష్కరించాలి జెడ్పిటిసి అరిగెల నాగేశ్వర్ రావు జెడ్పి చైర్ పర్సన

Published: Tuesday July 12, 2022
ఆసిఫాబాద్ జిల్లా జులై 11(ప్రజాపాలన, ప్రతినిధి) :  మండలంలోని అప్ప పెళ్లి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి, జెడ్పిటిసి, అరిగెల నాగేశ్వరరావు గ్రామస్థులతో కలిసి సోమవారం జెడ్పి చైర్ పర్సన్ కోవ లక్ష్మికి తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ అప్ప పెళ్లి గ్రామ ప్రజలకు వ్యవసాయ సాగు కు వట్టి వాగు నీటిని మళ్లించాలని, మరియు వర్షాల వలన రోడ్లు దెబ్బతిన్నాయని వాటికి మరమ్మతులు చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాబురావు, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, కోట పోచన్న, చంద్రయ్య, యాదగిరి, శ్రీశైలం, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.