దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె ను ప్రతి కార్మికుడు జయప్రదం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరణ

Published: Tuesday March 22, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి : ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు పెండ్యాల బ్రహ్మయ్య హాజరై మాట్లాడారు బీజేపీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే ఎజేండాతో ముందుకు వస్తుందని. కార్మిక వర్గమంతా దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రతి ఒక్కరు పోరాటం చేయాలని. పిలలుపునిచ్ఛారు. ముఖ్యంగానూతన లెబర్ కోడ్ లను రద్దు చేయాలని కనీసం వెతనం అమలుచేయాలని. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, పెంచిన పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని. దేశంలోని అన్ని రంగాల కార్మికులు సమ్మె లోపాల్గొంటారని మన యాచారం మండలం లోని అంగన్వాడీ కార్యకర్తలు.ఆశా కార్యకర్తలు, మధ్యాహ్నం భోజనం కార్మికులు. భవన నిర్మాణం కార్మికులు. ఆమాలీలు. ఆటో ట్రాన్స్పోర్ట్ వర్కర్స్. కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ రంగాలు, ఐకేపీ సిబ్బంది. విఆర్ఎలు అందరు ఈ రెండు రోజుల సమ్మె పాల్గొని తమ హక్కులకోసం ప్రతి కార్మికుడు, కార్మికురాలు. జయప్రదం చేయాలని కోరారు... ఈ కార్యక్రమంలో సుదర్శన్. జంగయ్య. సత్తయ్య. బక్కయ్య. అబ్బయ్య.మైసమ్మ.శాంతమ్మ. సుగుణమ్మ. హంసమ్మ. శివయ్య. ఇందిరమ్మ తదితరులు పాల్గొన్నారు.