బచ్చుకుంట చెరువును కబ్జా చేసి నిర్మిస్తున్న నిర్మాణంపై చర్యలు తీసుకోండి

Published: Friday June 04, 2021
- జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయం అధికారులు చెరువులను కాపాడే తీరు. అద్భుతమని, గతంలో కూల్చివేసిన చోట అధికార పార్టీ నాయకుల ప్రోద్భలంతో ఇలా చెరువులను కబ్జా చేస్తే, తహసీల్దార్ కార్యాలయం మౌనం వహిస్తూ పౌతే ఎలాగని, వెంటనే బచ్చుకుంట చెరువును కబ్జా చేస్తూ నిర్మిస్తున్న నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేసారు. దీనిపై  శేరిలింగంపల్లి తహసీల్దార్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బచ్చుకుంట చెరువులో లాక్ డౌన్ సమయంలో ఆదరాబాదరాగా రెండు ఫ్లోర్ లు స్లాబు వేసి, మూడో ఫ్లోర్ కు సిద్ధం చేశారని, వాట్సాప్ ఫిర్యాదు మేరకు అధికారులు మీ ఆదేశం మేరకు జేసీబీ తీసుకొని కూల్చివేతలకు వెళ్లి, తిరిగి చర్యలు తీసుకోకుండా వెనక్కి వచ్చేయడమేమిటని కసిరెడ్డి భాస్కరరెడ్డి ప్రశ్నించారు.. కొసమెరుపు ఏందంటే, అక్కడికి వెళ్లిన అధికారులు తిరిగి ఫిర్యాదు రాకుండా చూసుకోండని చెప్పి వెనక్కి వచ్చేసినట్లు సమాచారం. ఇక దీనిని కలెక్టర్, రంగారెడ్డి, ఆర్డీవో, రాజేంద్ర నగర్ లకు ఫిర్యాదు చేయడం జరిగిందని కసిరెడ్డి భాస్కరరెడ్డి తెలిపారు.