పోడు భూముల విషయంలో గ్రామసభలు సక్రమంగా నిర్వహించాలి ఐటిడిఏపీఓ గౌతం పోట్రు

Published: Tuesday November 22, 2022

 ఈనెల 21 నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మండలాల్లో జరుగుతున్న పోడు భూముల గ్రామ సభలను ఎటువంటి పొరపాట్లు లేకుండా సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పొట్రు అన్నారు.   ఆదివారం నాడు తన చాంబర్ నుండి టెలికాన్ఫెరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ మరియు ఆర్డీవోలు తాసిల్దారులు, ఎంపీడీవోలతో
గ్రామసభల నిర్వహణ ఎలా జరగాలో ఆయన సమీక్షించారు.
      ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల క్లైమూల విషయంలో గ్రామసభలు జరుగుతున్నందున, గ్రామసభలు జరుగుతున్నప్పుడు ఎటువంటి గొడవలు, వివాదాలకు తావు ఇవ్వకుండా చూడాలని, గ్రామసభలు జరుగు ప్రదేశాలలో గ్రామంలోని పోడు భూములకు సంబంధించిన రైతులతో పాటు, గ్రామంలోని ప్రజాప్రతినిధులు అందరూ ఉండేలా సంబంధిత అధికారులు చూసుకోవాలని, పూర్తిస్థాయిలో ప్రజలు ఉన్నప్పుడే గ్రామసభలు నిర్వహించాలని ,సోమవారం నాడు జిల్లాలో 133 గ్రామాలలో గ్రామసభలు జరుగుతున్నందున, గ్రామసభల నిర్వహణకు సంబంధించి క్లైముల సర్వే వెరిఫికేషన్ ఆదివారం సాయంత్రం కల్లా పూర్తి చేయాలని, అందుకు సంబంధిత ఎంపీడీవోలు ప్రత్యేక బాధ్యత తీసుకొని సర్వే జరుగుతున్న ప్రదేశాలను సందర్శించి వెరిఫికేషన్ పారదర్శకంగా జరిగాలా చూడాలని ,ఎవరి ప్రలోభాలకు తావు లేకుండా క్లైముల సర్వే ప్రక్రియ చాలా పగడ్బందీగా చేయాలని అన్నారు. సర్వే మరియు వెరిఫికేషన్ ప్రక్రియలో ఏమైనా పొరపాట్లు జరుగుతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సంబంధిత ఆర్డీవోలు వారి పరిధిలోని గ్రామాలలో పోడు భూముల యొక్క గ్రామసభలు జరుగుతున్నందున ఆ గ్రామసభలను తప్పనిసరిగా విజిట్ చేయాలని ,అన్ని సక్రమంగా ఉన్నప్పుడే గ్రామ సభ లు
జరిగేటట్టు చూడాలని, గ్రామసభ నిర్వహణలో ఏమైనా చిన్న పొరపాట్లు జరిగిన గిరిజన రైతులు నష్టపోయే అవకాశం ఉన్నందున, గ్రామసభలు సజావుగా జరిగేలా చూడాలని ఆర్డిఓ లను ఆదేశించారు.
    ఏ ఏ గ్రామాలలో గ్రామ సభ నిర్వహణ పూర్తయిన వెంటనే సంబంధిత రికార్డులను భద్రపరిచి చాలా జాగ్రత్తగా ఐటీడీఏ కార్యాలయంలో అప్పగించాలని ఆయన సంబంధిత అధికారులకు ఆదేశించారు.
    ఈ టెలీ కాన్ఫరెన్స్ కార్యక్రమంలో డిటిఆర్ఓ ఎఫ్ ఆర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.