కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్ సి వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలి : మాదిగ లాయర్

Published: Saturday July 02, 2022
హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):
 
రానున్న పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఎస్ సి వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు మాదిగ లాయర్స్ ఫెడరేషన్.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు వై కె విశ్వనాధ్ మాట్లాడుతూ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ కు విచ్చేస్తున్న బిజెపి నాయకులు ఇకనైనా ఎస్ సి వర్గీకరణ బిల్లు ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని, మాదిగ లు అత్యంత దీన పరిస్థితి లో ఉన్నారని, గత ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని బిజెపి ప్రభుత్వం మాదిగ ల సంక్షేమం కోరితే తక్షణమే బిల్లు ప్రవేశ పెట్టి చట్టం చేసి ఎస్ సి లకు న్యాయం చేయాలన్నారు.అధికారం లోకి వస్తే వంద రోజుల్లోనే వర్గీకరణ చేస్తామన్నా కేంద్ర ప్రభుత్వం మాట నిలుపుకోవాలన్నారు.ఈ కార్యక్రమం లో ఫెడరేషన్ నాయకులు ముత్తయ్య, వివి రత్నంకొత్తపల్లి ప్రసాద్ తో పాటు మరికొందరు న్యాయవాదులు పాల్గొన్నారు.