పల్లెప్రగతిలో ప్రజల భాగస్వామ్యం అవసరం : దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి

Published: Friday July 02, 2021
పరిగి 1 జూలై ప్రజాపాలన ప్రతినిధి : పది రోజుల పల్లెప్రగతి లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరం అని దోమ సర్పంచ్ కె రాజిరెడ్డి అన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా పెద్ద మండల కేంద్రంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీరు మురుగుకాల్వల నిర్వహణ వీధి దీపాలు ముఖ్యం అని ఇతర అభివృద్ధి పనుల్లో కూడా ఎన్ని పనులు చేపడుతున్న అభివృద్ధి అనేది నిరంతరాయం అన్నారు. తడి పొడి చెత్త సేకరణలో గృహిణిల శ్రద్ద కూడా ముఖ్యం అని చెప్పారు గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే మహిళల భాగస్వామ్యం ఎంతో అవసరమని అందుకు మహిళా సంఘాల కృషి ఎంతో అవసరం అని సర్పంచ్ రాజిరెడ్డి పేర్కొన్నారు. పది రోజుల ప్రగతి కార్యక్రమం లో గ్రామాల్లో ప్రజలకు అవసరం పడే పనులు చేపట్టాలని ప్రభుత్వ ఉద్దేశమని అందుకు అన్ని శాఖల అధికారుల సహకారం ముక్యంగా విద్యుత్. తాగునీరు ఉపాధి హామీ పనుల నిర్వహణలో సంబంధిత అధికారుల స్పందన ఎంతో అవసరం అని సర్పంచ్ అన్నారు. అనుబంధ గ్రామం ఉదనరావు పల్లిలో గ్రామస్తులు సూచించిన పలు అక్రమ నిర్మాణాలు నిలుపుదల చేయించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాల్ గౌడ్ పంచాయతీ కార్యదర్శి చెంద్రశేఖర్ గ్రంథాలయ శాఖ డైరెక్టర్  తల యాదయ్య గౌడ్ వార్డ్ సభ్యులు పలు శాఖల అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.