దామస్తాపూర్ గ్రామ సర్పంచ్ జైపాల్ రెడ్డి దాష్టీకం

Published: Thursday September 23, 2021
గ్రామ సమస్యలను పిట్టల శ్రీనివాస్ ప్రశ్నించిన పాపానికి బూటు కాలితో తన్నిన సర్పంచ్ 
వికారాబాద్ బ్యూరో 22 సెప్టెంబర్ ప్రజాపాలన : గ్రామంలోని సమస్యలను ప్రశ్నించిన పాపానికి సామాన్యునిపై బూటు కాలితో తన్నిన టిఆర్ఎస్ సర్పంచ్. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల పరిధిలోని దామస్తాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్తే దామస్తాపూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్ అనే వ్వక్తి గ్రామ పంచాయతీలో గ్రామ సమస్యలు చాలా వున్నాయని పేర్కొన్నారు. నీటి సమస్య, డ్రైనేజి సమస్య వంటి వాటి మీద దృష్టి సారించాలని సర్పంచ్ జైపాల్ రెడ్డికి కోరారు. రెండు రోజుల క్రితం అదే ప్రాంతంలో ఒక గొడవ గురించి పంచాయతీ పెట్టిన సర్పంచ్ జైపాల్ రెడ్డి. గ్రామ సమస్యలు నీకెందుకు రా అని కొట్టడం, బూటు కాలితో తన్నడం మొదలు పెట్టాడు. ఖంగు తిన్న పిట్టల శ్రీనివాస్ గ్రామ సమస్యలు అడగడానికి వస్తే నన్ను గొడ్డును బాదినట్లు బాది బూటు కాలితో తన్ని వెళ్ళగొడ్తాడా అని కన్నీటి పర్యంతమయ్యాడు. అధికార మదంతోనే ఈ దాష్టీకానికి ఒడిగట్టాడని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం బాధితుడు పిట్టల శ్రీనివాస్ పోలీసులకు పిర్యాదు చేసినట్లు సమాచారం.