కోవిడ్ నిబంధనలతో రంజాన్ వేడుకలు

Published: Saturday May 15, 2021
పరిగి, 14 మే, ప్రజాపాలన ప్రతినిధి : పవిత్ర రంజాన్ మాసం ముగిసిన సందర్భంగా వికారాబాద్ జిల్లా, దోమ మండల పరిధిలోని దిర్సoపల్లి గ్రామంలో శుక్రవారం ముస్లిం సోదరులు కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఘనంగా రంజాన్ వేడుకలు జరుపుకున్నారు. ఇలాగే ప్రతి గ్రామంలో మస్జీద్ లో ఇమామ్ సదర్ మౌజన్ కమిటీ పెద్దలు కలిసి 5 మంది మాత్రమే నమాజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా మస్జీద్ కమిటీ సదర్ అబ్దుల్ రహుఫ్ మాట్లాడుతూ ప్రతి రోజు కూడా లాక్డౌన్ నిబంధన లని పాటిస్తూ 5 సార్లు నమాజ్ 5 మంది తో మాత్రమే చేస్తున్నామని ఎలాంటి నిబంధనల ఉల్లాoఘన పనులు చేసుకోకుండా చుసుకుంటున్నామని అన్నారు. గ్రామ ప్రజలు అందరు ఎవరి ఇళ్ల లో వారు నమాజ్ చేసుకునే విధంగా చూసుకుమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇమామ్ హైమద్, అఖిల్, రషీద్ హజర్ పాల్గొన్నారు.