మినీ ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహానికి ఘనంగా నివాళి

Published: Monday September 27, 2021
జగిత్యాల, సెప్టెంబర్, 26 (ప్రజాపాలన ప్రతినిధి) : వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పట్టణంలో మినీ ట్యాంక్ బండ్ పై చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ దావ వసంతసురేష్ పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. జడ్పీ ఛైర్పర్సన్ మాట్లాడుతూ వెనకబడిన తరగతుల ప్రజల హక్కుల కోసం పోరాడిన వీర వనిత ఐలమ్మదని తెలంగాణ ఉద్యమ పోరాటం ఐలమ్మ స్పూర్తితో జరిగిందని, కుల, మత భేదం లేకుండా అన్ని కులాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని, మహిళలందరికి స్ఫూర్తినిచ్చింది, మహిళలకు గర్వకారణము చాకలి ఐలమ్మ అని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐలమ్మ రజాకార్ల, దొరలతో పాలనకు వ్యతిరేకంగా కొట్లాడి పోరాటంచేసిన ఘనత ఐలమ్మదని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారికంగా నేడు జయంతిని జరుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్, మునిస్పల్ చైర్మన్ భోగ శ్రావణి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణశ్రీ, స్థానిక కౌన్సిలర్ బాలే లత శంకర్, పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు గట్టు సతీష్, బీజేపీ నాయకులు రవీందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు గిరి, రజక సంఘ జిల్లా అధ్యక్షుడు నారాయణ, మండల అధ్యక్షుడు పోచాలు, ప్రజాప్రతినిధులు నాయకులు రజక సంఘ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.