కాలేజీ అడిగితే అరెస్టులు చేస్తారా..?

Published: Friday February 11, 2022
ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడి పై దాడి చేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలి.
అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు.
మంచిర్యాల బ్యూరో, పిబ్రవరి 10, ప్రజాపాలన : జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఎస్ఎప్ఐ విద్యార్థి నాయకుడి పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, ఆయన పై  దాడి చేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. అరెస్టు ను నిరసిస్తూ గురువారం అంబేద్కర్ విగ్రహం ఎదుట మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని శాంతియుతంగా ర్యాలీ చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అండదం డలతో ఎస్ఐ వచ్చి ర్యాలీ చేస్తున్న విద్యార్థి నాయకుడిపై దానికి పాల్పడ్డాడని అన్నాడు. కాళు బూట్లతో తన్నుతూ,కొడుతూ దాడి చేయడం జరిగిందని, కాలేజీ అడిగితే అరెస్టులు చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను అందించాలని ఎస్ఎఫ్ఐ గా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే అది చూసి ఓర్వలేని ఎమ్మెల్యే ఇలాంటి వాటికీ పాల్పడడం చాలా దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడే సమస్య లేదని సమస్యలు పరిష్కారం కోసం పోరాటం చేయడానికి వెనకడుగు వేసే ప్రసక్తేలేదని అన్నాడు. ఎస్ఎఫ్ఐ నాయకుడి పై దాడి చేసిన ఎస్ఐ ని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వినయ్, క్రాంతి, ప్రభాస్, ఆకాష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.