న్యూస్ 4 రెండు ఫోటోలు పెట్టండి సార్

Published: Thursday September 22, 2022
ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధి

*నేరాల నియంత్రణలో నిఘా నేత్రాల పాత్ర కీలకం
ఏసీపీ ఉమామహేశ్వరరావు
పోల్కంపల్లి లో సీసీ కెమెరాల ప్రారంభం*

సమాజంలో నేరాలను అదుపు చేయడం లో సీసీ కెమెరాల పాత్ర కీలకంగా మారిందని ఇబ్రహీంపట్నం ఏసీపీ ఉమామహేశ్వరరావు అన్నారు.బుధవారం మండల పరిధిలోని పోల్కంపల్లిలో  సిఐ సైదులు. స్థానిక సర్పంచ్ చెరుకూరి అండాలుగిరితో కలిసి సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీపీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. గతంలో పోలిస్తే నేటి సమాజంలో నేరాలు అతి తక్కువ సంఖ్యలో నమోదు అవుతున్నట్లు తెలిపారు. ఒక్కో కెమెరా వంద మంది పోలీసులతో సమానంగా పని చేయనున్నట్లు చెప్పారు. గ్రామం మొత్తం నిఘా నీడన ఉంటూ ఎప్పటికప్పుడు గ్రామంలో జరిగే విషయాలను గమనిస్తూ తమ నియంత్రణ లో ఉంటున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు చెడు మార్గం వైపు అడుగులు వేయకుండా  సన్మార్గంలో నడుచుకోవాలని పిలుపునిచ్చారు.అంతే కాకుండా చిన్నపాటి తగాదాలతో పొలీస్ స్టేషన్ల ,కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా తమ లక్ష్యాన్ని చేరుకునేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ చెరుకూరి మంగ రవిందర్, ఉపసర్పంచ్ కొమ్మిడి జంగారెడ్డి, వార్డు సభ్యులు బలమని,మన్నెమ్మ,మల్లమ్మ,యాదగిరిరెడ్డి పంచాయతీ కార్యదర్శి రాధ కానిస్టేబుల్ కోటేశ్వరరావు ,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.