పొదెం వీరయ్యకి ఘన స్వాగతం పలికిన మనుగూరు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.

Published: Thursday December 15, 2022
(ప్రజా పాలన ప్రతినిధి ) 
డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మొదటి సారి పినపాక నియోజకవర్గం లో అడుగు పెట్టిన సందర్బంగా మన్యం వీరుడు భద్రాచలం ఎమ్మెల్యే పొదేం వీరయ్య కి శాలువా కప్పి ఘన స్వాగతం పలికిన పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిశాల రామనాధం, మండల కాంగ్రెస్ శ్రేణులు..ఈ సందర్బంగా పినపాక మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు మండల అధ్యక్షులు గొడిశాల రామనాధం పొదేం వీరయ్య చే కాంగ్రెస్ పార్టీ జండా  ఎగరేసి కొబ్బరికాయ కొట్టించినారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  పొదేం వీరయ్య కి మరోసారి డీసీసీ పదవి రావడం పై ఆనందం వ్యక్తం చేశారు.