పదవ రోజు రిలే నిరాహార దీక్ష లను ప్రారంభించిన మధిర మాజిస్ట్రేట్ కోర్టు లాయర్లు.

Published: Thursday July 08, 2021
మధిర, జులై 07, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీమధిర ప్రభుత్వ ఆసుపత్రి లో డాక్టర్లను సిబ్బందిని నియమించాలని అఖిల పక్ష రాజకీయ పార్టీలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరన్ని ప్రారంభించిన లాయర్లు నంబూరి జనార్దన్ రావు, వాసంశెట్టి కోటేశ్వరరావులు. ఈరోజు దీక్షా శిబిరంలో సిపిఐ నుండి సిలివేరు శ్రీను, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నుండి ఆవుల కార్తీక్ పారా నారాయణ, టీడీపీ నుండి బోనాల ప్రసాద్ లు కూర్చున్నారు. ఈ సందర్బంగా దీక్షా శిబిరన్ని ఉద్దేశించి వాసంశెట్టి కోటేశ్వరరావు, నంబూరి జనార్దన్ లు మాట్లాడుతూ గత పది రోజులుగా మధిర నడిబొడ్డున మధిర ఆసుపత్రి లో డాక్టర్ లను సిబ్బందిని నియమించాలని రిలే నిరాహారా దీక్ష లు చేస్తున్నా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లు వేసి గెలిపించిన ప్రజా ప్రతినిధులు కూడా పట్టించుకోక పోవడం చూస్తుంటే పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన ఆరోగ్యం విషయంలో వీళ్ళ చిత్త శుద్ధి కనబడుతుంది. ప్రారంబోత్సవాల మీద ఉన్న శ్రద్ద ప్రజల ఆరోగ్యం విషయం పట్ల చూపకపోవడం దారుణం అని అన్నారు. డాక్టర్ లను సిబ్బందిని తక్షణమే నియామంచా లని డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు కలిగే వరకు డాక్టర్ లు వచ్చేవరకు మీకు మధిర బార్ లోని న్యాయవాదులు అండగా ఉంటారని మీ దీక్షలు విజయవంతం కావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో లాయర్లు గోపాల్, పల్లపోతు కృష్ణారావు, వెంకట్రావు పాల్గొన్నారు. సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు బెజవాడ రవిబాబు, ఊట్ల కొండలరావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, 15 వార్డు కౌన్సిలర్ కోనా ధని కుమార్,సైదెల్లిపురం సర్పంచ్ చిట్టిబాబు, టీడీపీ నుండి మల్లికార్జునరావు, సిపిఐ మండల సహాయకార్యదర్శి చావా మురళి, అన్నవరపు సత్యనారాయణ, రామానుజం, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నవీన్ రెడ్డి, కర్ణాటి రామారావు, ఆదిమూలం మొదలగువారు పాల్గొన్నారు.