*శాలివాహన పవర్ ప్లాంట్ పి.పి.ఏ. ను పొడిగించాలని కార్మికుల నిరాహార దీక్ష*

Published: Thursday January 05, 2023
మంచిర్యాల టౌన్, జనవరి 04, ప్రజాపాలన : మంచిర్యాల పట్టణం లోని  శాలివాహన  6 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్లాంట్  కార్మికులందరు కార్మిక సంఘము ఆద్వర్యంలో  పవర్ ప్లాంట్ పి.పి.ఏ. ను పొడిగించాలని బుధవారం ప్లాంట్ గేట్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం తో శాలివాహన పవర్ ప్లాంట్ చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పి.పి.ఏ) 20 సంవత్సరాల పాటు చేసుకుందని,ఈ అగ్రిమెంట్ తేదీ 2022 డిసెంబర్ 6 తో ముగిసిందని అన్నారు.     కంపెనీలో  200 మంది కార్మికులకు పైగా  పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారని  మధ్యంతరంగా కంపెనీ మూసివేస్తే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.    తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి శాలివాహన పవర్ ప్లాంట్ నకు మరో 10 సంవత్సరాల పాటు పి.పి.ఏ.ను పొడిగించి,పవర్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి పవర్ ప్లాంట్, కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని యెడల పలు ఆందోళన కార్యక్రమాలు చేస్తాం అని అన్నారు.ఈ కార్యక్రమం లో కార్మిక సంఘము నాయకులు ఎడ్ల శ్రీనివాస్, చెట్టి శ్రీనివాస్,కుంటాల శంకర్,ప్రసాద్,కనుకుంట్ల సుదీర్,సగ్గుర్తి ఆనందరావు, నిమ్మరాజుల సత్యం, తదితరులు   పాల్గొన్నారు.