లాక్ డౌన్ కష్టకాలంలో సహాయం కోసం అభాగ్యుల ఎదురుచూపులు

Published: Thursday May 20, 2021
బాలపూర్, మే 19, ప్రజాపాలన ప్రతినిధి : మాతృదేవోభవ వ్యవస్థాపకులు గట్టు గిరి అనాధల అభాగ్యులకు సహాయ సహకారాలు అందించగలరని విజ్ఞప్తి. బాలాపూర్ మండలం బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామం సమీపంలో ఉన్నటువంటి మాతృదేవోభవ అనాధ ఆశ్రమం లో ఉన్న అభాగ్యులను కరోనా లాక్డౌన్ ప్రభావం భాగంలో దాతలు ముందుకు రావడం లేదుని, ఆశ్రమంలో 7, 8 రోజులకు సరిపడే నిత్యవసర వస్తువులు ఉన్నాయని తెలిపారు. ఇంతకు ముందు దాతలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, ఇతర కార్యాలను ఆశ్రమంలో అభాగ్యుల మధ్యన జరుపుకొని వీరికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఈ అనాధలకు మూడు పూటల భోజనం అందించే  వాళ్ళమని ఆశ్రమ నిర్వాహకులు తెలిపారు. మానవతా హృదయాల దాతలు ముందుకొచ్చి ఆశ్రమవాసులకు ఆర్థికంగా నిత్యావసర సరుకులు అనాధ అభాగ్యులను ఆదుకో గలరని ప్రాధేయపడుతూ దాతలు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ సహాయ సహకారాలు ఆశిస్తున్నానుని మాతృదేవోభవ నిర్వాహకులు గట్టు గిరి అన్నారు.