బాలికలు, మహిళల పై జరుగుతున్న హింస, దాడుల నిర్మూలన లో ప్రభుత్వాలు విఫలం..

Published: Wednesday December 07, 2022
పాలేరు డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి
నేలకొండపల్లి
బాలికలు, మహిళల పై జరుగుతున్న హింస, దాడుల నిర్మూలన లో ప్రభుత్వాలు విఫలమైన్నట్లు అఖిల భారత మహిళ సంఘం రాష్ట్ర నాయకురాలు బుగ్గవీటి సరళ విమర్శించారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రభుత్వ కాలేజీలో ప్రభావతి అధ్యక్షత న సెమినార్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు ఆరికట్టాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా ద్వారా అశ్లీల చిత్రాలు ద్వంద అర్ధాలతో యువత పై ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. కుటుంబంలో తల్లిదండ్రులు కూడ ఆడ, మగ, అనే తేడా చూడకుండా ఇరువురు సమాన భావంతో చూడాలని సూచించారు. వారిలో చిన్న తనం నుంచే అవగాహన కలిపచాలని. -కోరారు. టీవీలు, సినిమాలు అశ్లీల చిత్రాలను పూర్తిగా సెన్సార్
చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఐద్వా అద్యక్షురాలు బండి పద్మ, కృష్ణవేణి, అనూష, డీవైఎఫ్ఎస్ఐ నాయకులు రత్నకిషోర్, నవీన్, బెల్లం లక్ష్మి, వెంకట్రావమ్మ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.