బిజెపి అధికారంలోకి రావడానికి మహిళలు ముందుకు రావాలి ** బిజెపి రాష్ట్ర మోర్చా అధ్యక్షురాలు గీ

Published: Tuesday December 27, 2022
ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 26 (ప్రజాపాలన,ప్రతినిధి) : బిజెపి పార్టీ అధికారంలో రావడానికి మహిళలందరూ ఏకం కావాలని బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ జిల్లా మహిళ మోర్చా జిల్లా అధ్యక్షురాలు కొమురం వందన అధ్యక్షతనలో జరిగిన కార్యవర్గ సమావేశానికి గీతా మూర్తి, జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గీతా మూర్తి, శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వంలో మహిళ సాధికారత కొరకై దేశంలోనే ప్రథమ పౌరురాలు ద్రౌపతి మురుము ను రాష్ట్రపతిగా గుర్తించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు. అత్యున్నతమైన ఆర్థిక శాఖ మంత్రి ఒక మహిళకు ఇవ్వడం ఇది కేవలం బిజెపి పార్టీకే సాధ్యమైందన్నారు. 11 మంది మహిళా మంత్రి పదవిని ఇచ్చిన ఘనత బిజెపి పార్టీ అని "బేటి బచావో బేటి పడావో" అనే నినాదంతో  మహిళలకు వెన్నుండి నడుపుతుంది బిజెపి పార్టీ. కొమరం భీమ్ జిల్లా మహిళలందరూ భీమ్ వారసత్వాన్ని ఉనికి పుచ్చుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో బిజెపి పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి సెర్ల మురళీధర్, శ్రీశైలం, కృష్ణకుమారి, ఆత్మారాం నాయక్, కొలిపాక కిరణ్, కుసుమ విజయ, సొల్లు లక్ష్మి,గణేష్, రాణి, మౌనిక, లక్ష్మి,జ్యోతి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
 
ఆసిఫాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ *మహిళా మోర్చా జీల్లా అధ్యక్షురాలు కుమ్మరం వందనా* 
అధ్యక్షతన కొమరం భీం జిల్లా
 మహిళా మోర్చా కార్యవర్గ సమావేశంనికి విచ్చేసిన బిజెపి **రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి గీత మూర్తి గారు, జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు.**
 
వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో  మహిళ సాధికారకొరకై 
దేశంలోనే  ప్రధమ పౌరురాలుగా ద్రౌపతి మురుము గారిని రాష్ట్రపతి గా   గుర్తించిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ
 అత్యున్నతమైనటువంటి ఆర్థిక శాఖ మంత్రి  ఒక మహిళకు ఇవ్వడం ఇది కేవలం భారతీయ జనతా పార్టీకే సాధ్యమన్నారు
11 మంది మహిళ  మంత్రి పదవిని ఇచ్చినటువంటి ఘనత బిజెపి పార్టీని
*బేటి  బచావో బేటి పడావో *  అనే నినాదంతో మహిళలకు వెన్నుండి నడుపుతున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కొమురం భీం జిల్లా మహిళలందరూ కొమురం భీమ్ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు 
 ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా జనరల్ సెక్రెటరీ చర్ల మురళి గారు, ధోని శ్రీశైలం గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కృష్ణకుమారి గారు,  రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఆత్మారాం నాయక్ గారు, పార్లమెంట్ కో కన్వీనర్ కొలిపాక కిరణ్ గారు,
 జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ కుసుమ విజయ,
తాలూకా కన్వీనర్ సొల్లు లక్ష్మి గారు, మండల అధ్యక్షులు గణేష్ గారు, రాణి, మౌనిక, లక్ష్మి జ్యోతి మండల్, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు