మధిర శివాలయంలో వచ్చే మురికి వాడను డ్రైనేజ్ నుంచి దుర్వాసన బాగు చేయండి తెలుగుదేశం పార్టీ

Published: Tuesday January 31, 2023
మధిర జనవరి 30 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో రెండో కాశీగాదక్షిణ కాశీగా పేరొందిన వందల సంత్సరాల చరిత్ర కలిగిన వైరా నది ఒడ్డున గల శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయం వద్ద మధిర పట్టణం నుండి వచ్చు మరుగు నీటిని హిందూ స్మశాన వాటిక నుండి డ్రైనేజ్ తీసుకొచ్చి దేవాలయం ముందు వదిలి భక్తులకు అసౌకర్యం కల్పించిన మున్సిపల్ పాలకులు, ఈ డ్రైనేజ్ నుండి వచ్చుదుర్గంధము భక్తులకు చాలా ఇబ్బందిగా ఉన్నదని అనేక పర్యాయములు రాష్ట్ర *టిడిపి నాయకులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం* ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ కి మరియు కమిషనర్ కి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వారు మహాశివరాత్రి నాటికి అక్కడ డ్రైనేజ్ మీద కల్వర్టు కట్టి పరిసరాలు అంతా శుభ్రంగా ఉంచుతామని హామీ ఇచ్చినారు కానీ ఈనాటి వరకే ఆ వాగ్దానం అమలుకావలేదు, కాగా భక్తులు ఇచ్చిన చందాల తో దేవస్థానం కమిటీ వారు తాత్కాలిక మరమ్మతులు చేయటం జరిగింది. ఈరోజు సదరు ప్రదేశమునందు పరిశీలనకు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉన్నది అన్న సంధాన, ఉన్నది అని రామనాథం మాట్లాడుతూ ఇప్పటికైనా పాలకులు త్వరితగట్టిన శివరాత్రి నాటికి పనులు పూర్తి చేయవలసిందిగా డిమాండ్ చేశారు.
 ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మల్లాది హనుమంతరావు, 14వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, మక్కెన నాగేశ్వరరావు, కొంకా రమేష్, మాగం ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.