స. హ. చట్టంపై అవగాహన కల్పించడం అభినందనీయం --జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి

Published: Thursday January 12, 2023

జగిత్యాల, జనవరి 11(ప్రజాపాలన ప్రతినిధి): సమాచార హక్కు చట్టం రక్షణ వేదిక పేరిట సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు స.హ చట్టంపై అవగాహన కల్పించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ గుగులోతు రవి అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సహా రక్షణ వేదిక 2023 క్యాలెండర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ రవి మాట్లాడుతు సామాన్యుని చేతిలో అస్త్రంలా పని చేసే సమాచార హక్కు చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేస్తామన్నారు. ప్రభుత్వ శాఖల నుండి సమాచారం కోరే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని, నియమ నిబంధనలకు లోబడి సమాచారాన్ని అన్ని శాఖల అధికారులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స.హా రక్షణ వేదిక గౌరవ సలహాదారులు, జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు తిరునగరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు ఆకుల నాగరాజు, సంయుక్త కార్యదర్శి గాజుల శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు, ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు నల్లాల జైపాల్, సంకోజీ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.