ఇబ్రహీంపట్నం ఆగస్టు తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి. *కుని ఆపరేషన్ చేసి మహిళల మరణానికి కారణం అయిన

Published: Tuesday August 30, 2022
ఇబ్రహీంపట్నం వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ్ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం ప్రభుత్వ హాస్పిటలో ఈ నెల 25వ తేదీ రోజు వివిధ గ్రామాలకు చెందిన 37మంది మహిళలకు డాక్టర్లు కుని అపరేషను చేశారు అందులో నలుగురి మహిళలకు కుని ఆపరేషన్ వైద్యం వికటించి వాంతులు విరోచనలు చేసుకొని మంచాల మండలం లింగం పల్లి గ్రామానికి చెందిన సుష్మ మాడుగుల మండలనికి చెందిన మమత ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు అన్నారు ఇంకా ఇద్దరి మహిళల పరిస్థితి కూడా విషమమంగా ఉండటంతో మహిళల కుటుంబ సభ్యులు దుఖ్ఖ సముద్రంలో మునిగి పోయారు అన్నారు ఇది ముమ్మాటికీ కుని ఆపరేషన్ చేసిన ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మహిళలకు వైద్యం వికటించి.చని పోయారు      తప్ప మహిళలకు ఆరోగ్య పరమైన ఇంకా ఎలాంటి ఇబ్బందులు లేవు అన్నారు వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చనిపోయిన మహిళలకు కుని ఆపరేషన్ చేసిన ప్రభుత్వ వైద్యుల పై చర్యలు తీసుకోవాలి మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరకుండా చూడాలి వైద్యం చేయించుకుంటున్న ఇద్దరి మహిళకు వైద్యం ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలి మరణించిన మహిళల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాం