ప్రభుత్వ పాలసీ కి వ్యతిరేకంగా వ్యవహారిస్తే కఠిన చర్యలు.

Published: Thursday July 08, 2021

నేరాల నిర్మూలన కోసమే కార్డెన్ అండ్ సెర్చ్
మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్

మంచిర్యాల జిల్లా ప్రతినిధి, జూలై 07, ప్రజాపాలన : ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా నిషేధిత గుట్కా ల , గుడుంబా తయారీ, బెల్టు షాపుల నిర్వహణ, ఇసుక అక్రమ రవాణా, కలప అక్రమ రవాణా వంటి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలు బాధపడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంచిర్యాల ఎసిపి అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మంచిర్యాల  జిల్లా దండేపల్లి మండలం లోని తానిమడుగు గ్రామంలో రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఏసీపీ అఖిల్ మహాజన్, లక్షేటిపేట సిఐ నారాయణ నారక్ నేతృత్వంలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇళ్లను సోదాలు చేశారు ఎలాంటి అనుమతులు లేకుండా బెల్టుషాపు నడుపుతున్న, అక్రమంగా టేకు కలప నిల్వచేసిన, గుడుంబా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తుల పట్టుకొని వారి పై కేసు నమోదు చేయడం చేశారు. వాహన పత్రాలు సరిగా లేని 30 మోటార్ సైకిల్లను, 2 ఆటోలను, ఒక కలప కోసే మిషిన్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ కలిగి ఉండాలి అన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఉండి ఏదైనా ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్ వర్తించదని పేర్కొన్న ఆయన ఇన్సూరెన్స్ గడువు ముగియాక ముందే దానిని రినివల్ చేపించుకోవాలని సూచించారు. మహిళల భద్రతే పోలీస్ లక్ష్యం అన్నారు. మహిళల, యువతులు, చిన్నపిల్లల తో మర్యాదగా ప్రవర్తించాలి. వారిని గౌరవించాలి. మన కుటుంబ సభ్యులతో ఎంత మర్యాదగా ఉంటామో బయట వారితో కూడా అలాగే మెదలాలి అని సూచించారు. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, వారిని మానసిక, శారీరకంగా హింసించిన వారిపట్ల చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం కేసులు నమోదు చేయడం జరుగుతుంది అని తెలిపారు. గ్రామంలో ఎవరైనా కొత్తవారు అనుమానా స్పదంగా తిరుగుతూ ఉంటే వెంటనే పోలీస్ లకు, డయల్ 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, వెంటనే చర్యలు చేపడతామన్నారు. తనిఖీలు నిర్వహించడం వలన నేరాల రేటు తగ్గుతాయని ప్రజలకు మరింత రక్షణ కల్పించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డిసిపి సంజీవ్, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, లక్షెట్టిపేట ఎస్ఐ చంద్రశేఖర్, PSI లు, సిబ్బంది పాల్గొన్నారు.