పీర్జాదిగూడలో ఆర్ బీ ఎల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం

Published: Tuesday March 22, 2022

మేడిపల్లి, మార్చి 21 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ 9వ డివిజన్ బిగ్ బజార్ ఎదురుగా ప్రధాన రహదారిలో ఆర్ బి ఎల్ బ్యాంక్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ జక్క వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కూమార్ గౌడ్ పాల్గొని స్థానిక కార్పొరేటర్ బచ్చ రాజుతో కలిసి బ్యాంకును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ డి.హరిశంకర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.