ఘనంగా సీత లా భవాని గొడ్ల దాటుడుపండగ

Published: Wednesday July 13, 2022

మధిర జూలై 12 ప్రజా పాలన ప్రతినిధిమధిర మండలం మంగళవారం నాడు వంగవీడు గ్రామంలోని గిరిజనులు లంబడిలు  ప్రతి ఏటా ఆశాడమాసంలో పెద్ద  పుషాల  కార్తె లో మొదటి రెండు మంగళ వారాల్లో  జరుపుకునే సిత్లా భవాని పండుగ ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా , గ్రామ పెద్దలు మాట్లాడుతూ గిరిజన సంప్రదాయ పండుగ ప్రతి ఏడాది ఆషాడ మాసంలో పెద్ద పుషాల  కార్తె లో మంగళవారం జరుపుకుంటారు అని తండా వాసులంతా ఏకమై పంట పొలాల శివారు ప్రాంతంలో గుట్ట మీద సిత్లా దేవత తో పాటు ఏడు దేవతలనుమేరమ్మ, తుల్జా, సిత్లా,మంత్రల్, ద్వాల్ అంగల్, కంకాళి, హింగ్ల,  ఏర్పాటు చేసి పూజలు చేస్తారు అని తెలియజేశారు అనంతరం   మాజి జడ్పీటీసీ మూడ్ ప్రియాంక మాట్లాడుతూ ఈ పండుగ రోజు సిత్లా భవాని కి పాలపొంగల్లు, జొన్న రొట్టెలు, గుగ్గిళ్ళు, కొబ్బరి ఫలహారం తో నైవేద్యంగా సమర్పించి మూగజీవలా  పేగును  అడ్డంగా పెట్టి పశువులను దాటిస్తారు  అందుకే దీనికి గొడ్ల దాటుడు పండగ అంటారు, దీని వలన పశువులు ఆరోగ్యంగా ఉంటాయి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంటారు అని గిరిజనుల నమ్మకం , వర్షాలు సమృద్ధిగా కురిసి గొడ్లకు మేత మరియు రైతులకు పంటలు బాగ పండుతాయి అని వారి నమ్మకం అని అన్నారు, ఈ కార్యక్రమంలో తండా పెద్దలు భూక్య హచ్యా నాయక్, కారభరి భూక్య భద్రు నాయక్, భూక్య తులిసా, భూక్య హెంమ్లా, గుగులోత్ వస్ర్రం , బానవత్ బంగి, నాగులు, మూడ్ జాంబు, మూడ్ లక్ముడు, భూక్య సక్రు పాల్గొన్నారు