యాదాద్రి భువనగిరి జిల్లా 9 అక్టోబర్ ప్రజాపాలన

Published: Monday October 10, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 9 అక్టోబర్ ప్రజాపాలన: వాల్మీకి మహర్షి జయంతి ని పురస్కరించుకుని ఆదివారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక కార్యక్రమాలను చేపట్టుతున్నారు. 
రఘు రాముని జీవితాన్ని రామాయణంగా రచించిన  ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి పురస్కరించుకొని జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.
 
ఆదికవి మహర్షి వాల్మీకి జన్మదినం అందరికీ పర్వదినం. నేటి సమాజానికి వాల్మీకి బోధనలు మార్గనిర్దేశనం. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఆదివారం ఉదయం భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు. 
బొమ్మల రామారం మండల ప్రజా పరిషత్ పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాశ్ రెడ్డి వాల్మీకి జయంతి సంధర్భంగా వారి చిత్రపటానికి  పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదుపరి పర్యవేక్షకులు గడ్డం జ్ఞాన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ....
 
వాల్మీకిని  సంస్కృత భాషకు ఆదికవిగా గుర్తిస్తారు. ఇతడే శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం.
 
 
"మా నిషాద ప్రతిష్ఠాం త్వమగమః శాశ్వతీః సమాః॥
యత్క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితం॥"
 
ఓ కిరాతుడా! నీవు శాశ్వతముగా అపకీర్తి పాలగుదువు.
ఎందుకంటే క్రౌంచ పక్షుల జంటలో కామ పరవశమైయున్న ఒక (మగ) పక్షిని చంపితివి. ఈ విధంగా వాల్మీకి నోట అప్రయత్నంగా వచ్చినదే సంస్కృత సాహిత్యంలో వచ్చిన మొదటి శ్లోకం. అలా మొదలయింది రామాయణ కావ్యం. 
ఆటవిక తెగకు చెందిన వాల్మీకి కరువుల వలన బ్రతుకు తెరువు కోసం ఉత్తర భారతదేశం నుండి వలస బాట పట్టాడు. ఆర్య తెగకు చెందిన సప్త ఋషులచే జ్ఞానోదయమైన తర్వాత, మహర్షిగా మారి దండకారణ్యంలో (నల్లమల అడవులు) గూండా దక్షిణ భారతదేశం, ఆ తర్వాత శ్రీలంకకు వలస వెళ్ళాడు. మార్గమధ్యంలో వివిధ ప్రదేశాల్లో బసచేస్తూ, అడవి ఆకులు, దుంపలు తింటూ విశ్రాంతి సమయంలో తన రామాయణం కావ్యాన్ని దేవనాగరి లిపిలో వ్రాస్తూ, తను వెళ్ళిన ప్రదేశాలని కావ్యంలో పేర్కొన్నాడు. ఆంధ్ర దేశంలో ఉన్న గోదావరి నది తీరంలో విశ్రమించి ఆ తర్వాత వృద్ధాప్య దశ వచ్చే సరికి తమిళనాడు రామేశ్వరం సముద్ర గట్టు వద్ద నున్న షోల్ మీదుగా శ్రీలంక ప్రవేశించాడు. శ్రీలంకలో తన రామాయణాన్ని యుద్ధకాండతో ముగించాడు. వాల్మీకి తన జీవిత కాలాన్ని శ్రీలంకలోనే ముంగిచాడని విశ్లేషకుల భావన. మహర్షి 
వాల్మీకి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
ఈ కార్యక్రమంలో  పంచాయతీ కార్యదర్శి సి.ఎస్. రాంబాబు అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.