అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ దరఖాస్తుల తేది పొడగింపు

Published: Thursday June 17, 2021
జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటాజీ
వికారాబాద్, జూన్ 16, ప్రజాపాలన బ్యూరో : విదేశాల్లో ఉన్నత చదువులకు అర్హులైన ఎస్టి విద్యార్థిని, విద్యార్థులు  అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని గిరిజన జిల్లా అభివృద్ధి అధికారి ఆర్.కోటాజీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమెరికా, లండన్, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, జపాన్, ఫ్రాన్స్, సౌత్ కొరియా దేశాల్లోని యూనివర్సిటీలలో  పీజీ, ఆపై చదువులకు ఈ పథకం  కింద రూ.20 లక్షలు వరకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలియజేసినారు. వీసా మరియు విమాన చార్జీలు  ఇవ్వనున్నట్లు తెలిపారు. 2021 జూలై 1వ తేది నాటికీ 35 సం.రాలు మించరాదని సూచించారు. స్టూడెంట్ కుటుంబ  సంవత్సర ఆదాయం రూ.5 లక్షలు మించరాదని, అర్హులైన విద్యార్థి, విద్యార్థినులు http://telangana epass.cgg.gov .in వెబ్ సైట్ ద్వారా జూన్ 30 వ తేది వరకు దరఖాస్తు చేసుకోగలరని ఆ ప్రకటనలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి తెలియజేసినారు.