నేడు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

Published: Wednesday June 02, 2021

ఆసిఫాబాద్ జిల్లా జూన్ 01, ప్రజాపాలన, ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కార్మికుల జీవితాలలో వెలుగు నిండేనా,? టిఆర్ఎస్ ప్రభుత్వం హంగామా, ఆర్భాటాలతో, సంబరాలు జరుగుతుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్, మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా అల్లూరి లోకేష్ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం హంగు, ఆర్భాటాలతో, సంబరాలు జరుగుతుందని, తెలంగాణ సాధన కోసం అనేకమంది ప్రజలు, మేధావులు, విద్యార్థులు, ఉద్యోగ, కార్మికులు, ముందు నిలబడి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు పోరాటాలు చేశారన్నారు. నిధులు నియామకాల సాధన కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగిందని, రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యోగ, కార్మికుల, పరిస్థితులు, బతుకులలో మార్పులు, వచ్చి జీవితాలలో ఎలాంటి వెలుగులు కనబడడం లేదన్నారు. నేడు జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, వాటికి కేటాయించిన నిధులు, అభివృద్ధి కోసం చేయవలసిన పనుల గురించి వివరణ ఇచ్చి నిధులు ప్రకటించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్ టైం, వర్క్ బెస్ట్ ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాలలో పనిచేస్తున్న స్కీమ్ వర్కర్లు, ఆశ, అంగన్వాడి, వైద్య రంగాలలో, పనిచేస్తున్న ఉద్యోగులు, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు, మధ్యాహ్న భోజన, ఉపాధి హామీ, పంచాయతీ మున్సిపాలిటీ ఆర్టీసీ కార్మికులకు, ఉద్యోగ భద్రత కనీస వేతనాలు రూ 21వేలు ఇవ్వాలన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్ లను, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, సంగతిత, అసంఘటిత, రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు పని దినాలు కల్పించాలని, అన్ని విధాలుగా కార్మికులకు ప్రభుత్వం అండగా ఉండాలని, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. అవతరణ సందర్భంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజీ, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన కాలేజీలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా తో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూ 10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించాలని, కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలని, రేషన్ షాపుల ద్వారా 18 రకాల నిత్యావసర వస్తువులను ఉచితంగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లుగా మన రాష్ట్ర ప్రభుత్వం అందించాలని కోరారు. ముందు వరుసలో నిలబడి కరోనా రోగులకు ప్రజలకు సేవలందిస్తూ చనిపోయిన వారికి రూ 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటన చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. ఈ సమస్యలను పరిష్కారం చేసినప్పుడే సంపూర్ణ తెలంగాణ, బంగారు తెలంగాణ, సాధ్యమవుతుందని, ఆకలి కేకలు లేని తెలంగాణలో అందరూ సుఖశాంతులతో ఉండాలంటే, ఇప్పటికైనా నిధులు, నియామకాలు, ఉద్యోగ భద్రతను, కల్పించాలని, కోరుకుంటున్నామన్నారు.