మహిళలు ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

Published: Thursday April 28, 2022
బ్యాంకర్ల గ్రామీణ, జిల్లా మహిళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్
వికారాబాద్ బ్యూరో 27 ఏప్రిల్ ప్రజాపాలన : మహిళలు తమ కాళ్ళమీద నిలబడి స్వయం ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని బ్యాంకర్ల గ్రామీణ, జిల్లా మహిళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ మోహన్ అన్నారు. బుధవారం హైదరాబాద్లోని శాంతినగర్ లోని బసవేశ్వర మందిరంలో మహిళలకు ఉచితంగా జర్దోసి మగ్గం కోర్సుల ఉచిత శిక్షణను బ్రెడ్ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ కార్యదర్శి సత్తయ్య అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా బైరెడ్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ పి.మోహన్, ఎస్బిఐ జహిరాబాద్ శాఖ అసిస్టెంట్ మేనేజర్ ఎంఎస్ శివకృష్ణ, పెద్దలు శేఖర్, సురేష్ స్వామి, శిక్షకురాలు నిఖిల సమక్షంలో ప్రారంభం అయ్యింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా ఇస్తున్న ఉచిత శిక్షణనుక వినియోగించుకోవాలని సూచించారు. తాము ఇప్పటివరకు 18 వేల మందికి వివిధ వృత్తి శిక్షణను ఉచితంగా అందజేశామని వివరించారు. జహీరాబాద్ పట్టణపరిధిలో జర్దోసి మగ్గం కోర్సులలోఉచితంగా శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ఎంతో వ్యయప్రయాసలకు ఓర్చి ఈ శిక్షణను మీకు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. 37 రోజుల పాటు శిక్షణ ఉంటుందని అలాగే మధ్యాహ్న భోజనం వసతి ఏర్పాటు చేయడమైనది అని అన్నారు. శిక్షణకు అవసరమైన సామగ్రిని కూడా తామే అందజేస్తామని తెలిపారు. జర్దోసి వర్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని గుర్తు చేశారు. ఈ వృత్తి చేపట్టినా ఫలితంగా యూనిట్ ఏర్పాటు చేసిన ఆర్థికంగా లబ్ధి పొందవచ్చని పేర్కొన్నారు. ఈ శిక్షణ కంటికి చేతికి అధికంగా శ్రమ ఉంటుంది అని చెప్పారు. ఎస్బిఐ జహీరాబాద్ శాఖ అసిస్టెంట్ మేనేజర్ శివకృష్ణ మాట్లాడుతూ మంచి నైపుణ్యం అర్హత కలిగిన వారికి బ్యాంకు ద్వారా రుణాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. శిక్షణలో 60 మందికి పైగా మహిళలు పాల్గొనడం అభినందనీయమని కొనియాడారు.