సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి --జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

Published: Wednesday July 13, 2022
జగిత్యాల, జులై, 12 ( ప్రజాపాలన ప్రతినిధి):  జెడ్పీ చైర్ పర్సన్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయములో జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్  జిల్లాలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సీజనల్ వ్యాదులు, సానిటేషన్, వరదలు మరియు హరిత హారం కార్యక్రమం పై సమీక్షా సమావేశము నిర్వహించినారు. ఈ సమావేశములో జెడ్పీ చైర్ పర్సన్ మాట్లాడుతూ భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోన, సీజనలు వ్యాధులు, మరియు డెంగ్యు జ్వరాలు రాకుండా ప్రతి ఒక్కరు పారిశుద్ధ్యం పైన అవగాహన కల్పించుకొని ఆప్రమత్తముగా ఉండాలని, ప్రతి పిహెచ్ సి లో వైద్యులు మరియు సిబ్బంది ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. గ్రామాలలో శిధిలావస్త లో ఉన్న ఇండ్లను గుర్తించి వారికి సరైన అవగాహన కల్పించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వరదల దృష్ట్యా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించినారు. ఈ సమావేశములో కార్యనిర్వహణ అధికారి సుందర వరధరజన్, జి.ప్ర.ప జగిత్యాల, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్, జిల్లా పంచాయితీ అధికారి హారి కిషన్ మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి  శ్రీధర్, ఎంపిడిఒ లు తదితులున్నారు.