తెరాస ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడిందుకే భట్టి పాదయాత్ర

Published: Monday August 08, 2022
75 కిలోమీటర్ల మేరకు కొనసాగునున్న యాత్ర
 
బోనకల్, ఆగస్టు 07 ప్రజా పాలన ప్రతినిధి: క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమై 75 సంవత్సరాలు అవుతున్న తరుణంలో ఆగస్టు 9వ తేదీ నుంచి మధిర శాసన సభ్యులు సిఎల్పీ నాయకులు మల్లు భట్టి విక్రమార్క జిల్లాలో తలపెట్టిన 75కిలోమీటర్లు పాదయాత్ర పై స్థానికమండల పరిధిలోని కలకోట గ్రామంలో 
డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ నివాసం వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో పాదయాత్ర పై చర్చించటం జరిగింది.ఈ పాదయాత్ర ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మొదలై ఖమ్మం రూరల్, ఖమ్మం,వైరా,తల్లాడ, కల్లూరు మీదుగా పెనుబల్లి వరకు మొత్తం 75కిలోమీటర్లు మేరకు కొనసాగుతుందని స్పష్టం చేశారు.ఈ పాదయాత్రను ఉద్దేశించి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు మాట్లాడుతూ స్వరాజ్య సముపార్జన కోసం ప్రారంభమైన క్విట్‌ ఇండియా ఉద్యమ లక్ష్యం అనతి కాలంలోనే నెరవేరినప్పటికీ స్వేచ్చా భారత మిషన్‌లో మనం విజయం సాధించామా అనే విషయాన్ని ఒక్కసారి ఆలోచించుకోవాలని దుర్గారావు పేర్కొన్నారు.అందుకోసమే ప్రజాస్వామ్యం చచ్చిపోతున్న తరుణంలో తిరిగి బ్రతికించుకునేందుకు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతుందని ఆయన అన్నారు.భారత దేశం ఆధునిక చరిత్రలో ఆగస్టు నెలకు ప్రత్యేకమైన స్దానం ఉంది.శాంతి దూత అయిన మహాత్మాగాంధీ అహింస ద్వారానే స్వరాజ్య సముపార్జన సాధ్యమవుతుందని త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరణలోచూపి స్వరాజ్య పోరాటానికి నైతిక బలంతో పాటు ప్రజా బలాన్ని కూడగట్టి 1915లో దక్షిణాఫ్రికా నుంచి భారత దేశానికి తిరిగి వచ్చినప్పటి నుంచి ఆయన ఇదే బాటలో ముందుకు సాగారని అన్నారు. సహాయ నిరాకరణ,శాసనోల్లంఘన మార్గాలను ప్రచారం చేయడం ద్వారా మహాత్ముడు దేశాన్ని ముందుకు నడిపారని ఆయన అన్నారు.మండలంలోని ప్రతి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరు అధిక సంఖ్యలో పాల్గొని విక్రమార్క అడుగులొ అడుగు వేస్తూ చివరి వరకు పాల్గోని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం డీసీసీ కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్ మాట్లాడుతూ శాంతియువత మార్గంలోని గొప్పదనాన్ని తెలియజేస్తూ గాంధీజీ చెప్పిన ప్రతి మాట, మంత్రమై యావత్‌దేశాన్ని ఉత్తేజితం చేసిందని,ఆగస్టు8, 1942న ముంబైలోని గోవాలియా ట్యాంక్‌మైదానం నుంచి చేసిన క్విట్‌ ఇండియా ప్రసంగంలో దేశ స్వేచ్చ కోసం మహాత్ముడు పలికిన డూ ఆర్‌ డై అనే నినాదాన్నిచ్చి ముందుకు నడిచారని,ప్రస్తుతం భట్టి విక్రమార్క పాదయాత్రతో తెరాస ప్రభుత్వం నిరంకుశ పాలనకు చరమగీతం పాడేందుకు సమర శంఖం పూరించి ఈ నెల తొమ్మిదవ తేది నుంచి మొదలయ్యే పాదయాత్రలో ప్రజలు, కార్యకర్తలు ఆయన వెంట కలిసి నడిచి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్నాటి రామ కోటేశ్వరరావు, మండల కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు నల్లమోతు సత్యనారాయణ, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు భూక్యా భద్రు నాయక్, బ్రాహ్మణపల్లి గ్రామ శాఖ అద్యక్షుడు గంగాసని రాఘవరావు,అచ్చుయ్య,కలకోట గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area