వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Published: Wednesday July 27, 2022
మధిరచింతకాని జులై 26 ప్రజాపాలన ప్రతినిధి వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మద్దెల ప్రసాదరావు చింతకాని మండల అధ్యక్షులు వాకా వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మధిర చింతకాని మండలాల్లో కొనసాగుతున్న వీఆర్ఏల దీక్షా శిబిరాలను సందర్శించి, వారికి సంఘీభావం ప్రకటించి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి  వీఆర్ఏలకు పే స్కేలు అమలు  చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు. ముఖ్యమంత్రి హామీ ప్రకారం వీఆర్ఏలకు పే స్కేలు అమలు చేయాలని అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతి కలిగించాలన్నారు. 55 సంవత్సరాలు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగ అవకాశం పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. అకాల మరణం పొందిన విఆర్ఓ కుటుంబాల్లో కారుణ్య నియామకాలు చేపట్టాలన్నారు. వీఆర్ఏలు చేస్తున్న డిమాండ్లు న్యాయమైనవని,
వారి యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వీఆర్ఏల చేస్తున్న పోరాటానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ షర్మిలమ్మ అధికారంలోకి రాగానే వీఆర్ఏల సమస్యలను పరిష్కారం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో చింతకాని మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షులు బి నాగేశ్వరావు స్వరూప, రమేష్, జానీ, మీరా, రాములమ్మ, కవిత కరీముల్లా బాబు గురవయ్య సీతయ్య అంజయ్య ముత్తయ్య తదితరులు పాల్గొన్నారు.